Drinking Water Before Sleep: సాధారణంగా మానవ శరీరానికి నీరు అత్యంత అవసరం. ప్రతి వ్యక్తిలో 60 శాతం నీరు నిండి ఉంటుంది. అయినా కూడా ఇది తగ్గినప్పుడు దానిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతిరోజు 2 నుంచి 3 లీటర్ల వరకు నీటిని తాగుతూ ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వేసవికాలంలో అయితే మరింత ఎక్కువగా నీరు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ నీరు కూడా అవసరం ఉన్నంతవరకు మాత్రమే తీసుకోవాలి. అవసరానికి మించి తీసుకుంటే శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రపోయే ముందు వీటిని ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే?
నిద్రపోయే ముందు మీరు ఎక్కువగా తాగడం వల్ల పదేపదే మూత్రవిసర్జన కోసం నిద్ర లేవాల్సి వస్తుంది. దీంతో నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. దీనినే నాక్టూరియా అని అంటారు. ఇలా నిద్రలేమి సమస్య వల్ల ఆ మరుసటి రోజు అలసట ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఇలా నిద్ర భంగం కలిగితే నిద్ర నాణ్యత చెడిపోతుంది. ఫలితంగా డీప్ స్లీప్ లోకి వెళ్లకుండా మానసికంగా సమస్యలు ఎదురవుతాయి. ఉదయం లేవగానే తలనొప్పి, నీరసం, మూడ్ ఆఫ్ వంటి సమస్యలు ఉంటాయి.
నిద్రపోయే ముందు నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపై అదనపు ఒత్తిడి కలుగుతుంది. ఐబీపీ ఉన్నవారు నీటిని ఎక్కువగా తాగడం వల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. దీంతో ఒక్కోసారి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి వ్యక్తిలో రాత్రి సమయంలో కిడ్నీలు నెమ్మదిగా పనిచేస్తాయి. ఇలాంటి సమయంలో మీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిపై అనవసరపు ఒత్తిడి పడుతుంది. దీంతో దీర్ఘకాలంలో ఇవి సమస్యలకు దారి తీయవచ్చు. రాత్రి సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాళ్లలో వాపు ఏర్పడుతుంది. ఉదయం లేవగానే ఇది కనిపించి నడవడానికి ఇబ్బందిగా మారుతుంది. అంతేకాకుండా రాత్రి సమయంలో మీరు ఎక్కువగా తాగడం వల్ల ఉదయం మొహంలో అనేక సమస్యలు వస్తాయి. ఇక సాధారణ సమయంలోను అవసరానికి మించి నీటిని తీసుకోవద్దు. శరీరంలో నీరు ఎక్కువగా ఏర్పడితే లవణ శాతం తగ్గుతుంది. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ తగ్గి అలసట వస్తుంది. ఒక్కోసారి కింద పడిపోయే అవకాశం కూడా ఉంటుంది.
అయితే నీరు తాగడం తప్పనిసరి కాబట్టి నిద్రపోయే ఒకటి లేదా రెండు గంటల ముందే కావాల్సిన నీరును తీసుకోవాలి. ఒకవేళ వేసవికాలంలో దాహం వేస్తే కొద్దిగా తీసుకోవడం మంచిది. అయితే ఒక రోజులో రెండు నుంచి మూడు లీటర్ల వరకు నీటిని తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు ఉన్నవారు నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రభావం మరింతగా పడుతుంది.