Alcohal Effects: మనలో కొంతమంది మద్యం తాగడాన్ని ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కొంతమంది ఆ అలవాటును మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు. సంతోషం కలిగినా, బాధ కలిగినా మద్యం తాగడాన్ని కొంతమంది ఇష్టపడుతున్నారు. తక్కువ మొత్తంలో మద్యం తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని భావించి కొంతమంది ఈ అలవాటు వైపు ఆకర్షితులు అవుతున్నారు.
మద్యం వల్ల ఊబకాయం బారిన పడితే భవిష్యత్తులో మధుమేహం, రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మద్యం తాగేవాళ్లలో శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మద్యం ఎక్కువగా తీసుకుంటే అది శరీరంలో విషంగా మారుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే మద్యం అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును దూరం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
మద్యం వల్ల కొన్ని లాభాలు ఉన్నా ఎక్కువగా నష్టాలు ఉన్నాయి. మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్లు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. మద్యం తాగడం వల్ల తాత్కాలికంగా సంతోషం కలిగినా భవిష్యత్తులో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.