Homeహెల్త్‌Tips for Brain Sharp : గుండెకు కొవ్వులేని ఆహారం.. మరి మెదడు కోసం ఏం...

Tips for Brain Sharp : గుండెకు కొవ్వులేని ఆహారం.. మరి మెదడు కోసం ఏం తినాలో తెలుసా?

Tips for Brain Sharp : గుండెకు మేలు చేసే ఆహారం తీసుకుంటున్నారా.. గుండెకు మేలుచేసే ఆహారం మెదడునూ రక్షిస్తుందట. ఈ విషయాన్ని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచే మెదడు మీద పోషణ ప్రభావాలు ఉంటాయట. గర్భం దాల్చిన మహిళలు తీసుకునే ఆహారం.. బిడ్డ మెదడు ఎదుగుదలను ప్రభావితం చేస్తుందని పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఫోలేట్‌(విటమిన్‌ బీ9) పిండ మెదడు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుందట. గర్భిణులు ఈ విటమిన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే పిల్లలు పుట్టుకతో తలెత్తే లోపాలను అధిగమిస్తారని పేర్కొంటున్నారు. ఇక ఆహారం విషయానికి వస్తే ఆకు కూరలు, బఠానీలు, చిక్కుడు గింజలు, పండ్లు, సముద్ర చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, మాంసం, కోడికూరలో విటమిన్‌ బీ9 ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వు ఉండే ఆహారం తీసుకుంటే పుట్టే పిల్లలకు ఆందోళన, కుంగుబాటు, ఏకాగ్రత లోపం, అటిజం వంటి సమస్యలు వస్తాయని నినపుణులు పేర్కొంటున్నారు. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు తల్లి కడుపులో ఉన్నప్పుడే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

శైశవ, బాల, కౌమార దశల్లో ఇవీ..
ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలతో మెదడుకు కలిగే ప్రయోజనాలు పుట్టిన తర్వాత కొన్ని నెలల వరకు కొనసాగుతాయి. కొవ్వులు కలిపిన అదనపు ఆహారం తిన్న శిశువులు 9 నెలల వయసులో ఇతరులకన్నా భాగా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు అధ్యయనాలు వివరిస్తున్నాయి. మొదటి రెండేళ్ల వయసులో మెదడు వృద్ధి చెందడంలో పిల్లలు తినే ఆహారం గణనీయమైన పాత్ర పోషిస్తుంది. ఈ వయసులో మెదడు కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. నాడీ కణాల మీద కొవ్వులు, ప్రొటీన్లతో కూడిన మైలిన్‌ అనే రక్షణ పొర ఏరపడుతుంది. మెదడు పెరిగే కొద్ది నాడీ కణాలు అనుసంధానాలు ఏర్పర్చుకుంటాయి. దీనికి అవసరమైన శక్తి పిల్లలు తీసుకునే ఆహారం నుంచే లభిస్తుంది. మంచి ఆహారం తీసుకోకపోతే నాడీ అనుసంధానాలు ఏర్పడక బాల, కౌమార దశల్లో పోషణ లేమితో పిల్లల మెదడు ఎదగడం, విషయ సంగ్రహణ సామర్థ్యాలకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో చదువులో వెనకబడతారు. మంచి కొవ్వులు, పిండి పదార్థాలు, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయట. చేపలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినేవారు చదువుల్లో రాణిస్తున్నట్లు పరిశోధనలో నిర్ధారణ అయింది. బాల్యంలో కొవ్వు పదార్థాలు, తీపి పానీయాలు ఎక్కువగా తీసుకుంటే సమస్యలను ఎక్కువగా పరిష్కరిస్తారట.

పెద్ద వయసులో
ఇక పెద్ద వయసులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న ఆహారం తగినంత తీసుకుంటే మూడ్‌ సమస్యలు విషయ హ్రణ లోపం ఉండదు. ఈ ఆమ్లాలు ఎక్కువగా తీసుకుంటే జ్ఞాపక శక్తి, విషయ గ్రహణ సామర్థాలు మెరుగవుతాయట. మెదడుకు రక్త ప్రసరణ పుంజుకుంటుంది. మధ్య వయసులో ఆహారం తీసుకుంటే మెదడు ఆకృతి, పరిమానంతోనూ సంబంధం ఉంటుంది. చెడు కొవ్వు, ప్రాసెస్డ్‌ పదార్థాలు, చక్కెర వంటివి అనారోగ్యానికి కారణమవుతాయి అధిక బరువుకు దోహదపడతాయి. అధిక కొలెస్ట్రాల్‌ ముప్పు పెరుగుతుంది.

మెదడుకు మేలుచేసే ఆహారమంటే?
ఆహారం ద్వారా మెదడుకు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే సమతుల ఆహారంపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మెడిటేరియన్‌ డైట్‌ అధిక రక్తపోటు నివారణకు తోడ్పడుతుంది. డ్యాష్‌ డైట్‌ ఈ రెండింటి కతబోత. మైండ్‌ డైట్‌ కోసం రకరకాల ఆహార పద్ధతులపై అధ్యయనాలు జరిగాయి. ప్రాజెస్డ్‌ పదార్థాలు, చెడు కొవ్వులు, చక్కెర ఎక్కువగా ఉంటే పాశ్చాత్య ఆహార పద్ధతికి దూరండా ఉండాలి. కూరగాయలు, పండ్లు, పలుచటి మాంసం, చేపలు వంటివి తీసుకుంటే తగినన్ని పోషకాలు అందుతాయి. మంచి కొవ్వులు, ప్రొటీన్లు లభిస్తాయి. మెదడుకు మేలు చేస్తాయి.

మైండ్‌ డైట్‌ తీరిదీ
మెడిటేరియన్‌ డైట్, డ్యాష్‌ డైట్‌ కలబోత మైండ్‌ డైట్‌. ఇందులో ఇవి ప్రధానమైనవి.

– తాజా ఆకుకూరలు, కూరగాయలు వారానికి ఆరు లేదా అంతకన్నా ఎక్కువసార్లు తినాలి. ఆకు కూరతోపాటు రోజూ ఏదో ఒక కూరగాయ తీసుకోవడం మంచింది. పిండి పదార్థాలు లేని కూరగాయలు మంచిది.

– స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లు వారానికి ఒకసారి తీసుకోవాలి.

– బాదం, పిస్తా, అక్రోట్ల వంటి గింజ పప్పులు వారానికి ఐదుసార్లు తీసుకుంటే మంచింది.

– ఆలివ్‌ ఆయిల్, గానుగ నూనెగా వాడుకోవాలి.

– పొట్టు తీయని ధాన్యాలు రోజుకు మూడుసార్లు తీసుకోవాలి.

– చేపలు వారానికి ఒకసారైనా తినాలి.

– చిక్కుడు గింజలు, పప్పులు వారానికి కనీసం నాలుగసార్లు తీసుకోవాలి.

– మాంసాహారులైతే చికెన్‌ వారానికి ఒకసారి తీసుకోవాలి.

– మితంగా వైన్, రెడ్‌ ౖÐð న్‌లోని రెస్వెంటాల్‌ మేలు చేస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular