Brain Health: లవంగాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. కానీ, లవంగాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. మరి అవేమిటో చూద్దామా.
1. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ C మరియు K ఉంటాయి. ఈ మాంగనీస్ అనేది మన మెదడు పనితీరును అద్భుతంగా పెంచుతుంది. అలాగే ఎముకలు గట్టి పడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ C మరియు K రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఇక రక్తం గడ్డకట్టడానికి కూడా ఇవి బాగా సహాయపడుతాయని వైద్య నిపుణులు కూడా క్లారిటీ ఇచ్చారు.
2. ఇక ఈ లవంగాల లో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. మీకు తెలుసా ? ఈ లక్షణాలు తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి అనేక రుగ్మతలను బాగా తగ్గిస్తాయి.
Also Read: వేశ్యగా మారబోతున్న సీనియర్ యాంకర్ !
3. ఇక లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొప్ప రిలీఫ్ ను ఇస్తాయి. అలాగే మనలో పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవి చాలా గొప్పగా సహాయపడతాయి. పైగా లవంగాలు దగ్గు, జలుబు, ఆస్తమా వంటి రోగాలను కూడా బాగా తగ్గిస్తాయి.
4. అన్నట్టు లవంగం నూనె.. దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ లవంగం నూనెలో బ్రాంకైటిస్, ఆస్తమా, మరియు ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు మరియు దగ్గు వంటి వాటిని తగ్గించే శక్తి ఉంది. అందుకే ఈ నూనె శ్వాస నాళాన్ని బాగా మెరుగు పరుస్తుంది.
5. ఇక ఈ లవంగం నూనెను ఛాతి పై, ముక్కు పై మర్దన చేస్తే వెంటనే గొప్ప ఉపశమనం కలుగుతుంది. అలాగే ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేసినా గొప్ప రిలీఫ్ గా అనిపిస్తోంది.
Also Read: ఈ హీరోయిన్స్‌కు వారి తల్లులే నరకం చూపించారట.. ఆస్తి కోసం ఇంత దారుణమా..!