LAW: తల్లిదండ్రుల ఆస్తిలో కూతురికి ఎంత వాటా ఉంటుందనే ప్రశ్నకు ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. దేశంలో లక్షలాది కుటుంబాలలో ఆస్తులకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. కోర్టుల్లో భూ వివాదాలకు సంబంధించి ఉన్న కేసులు ఏకంగా నాలుగు కోట్లు కావడం గమనార్హం. ఒక కూతురుకు తండ్రి ఆస్తిలో, తాత ఆస్తిలో వాటా ఉంటుందా? పెళ్లి తర్వాత కూతురు ఆస్తిలో హక్కును పొందగలదా? అనే ప్రశ్న చాలామందిలో వ్యక్తమవుతోంది.
హిందూ వారసత్వ చట్టం 1956, 2005 కూతురికి పూర్వీకుల ఆస్తిలో సమానంగా వాటా ఉండనుంది. కూతురు పుట్టినప్పటి నుంచి వారసత్వంగా ఆస్తిలో వాటాను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. కూతురుకు పెళ్లి అయినా కాకపోయినా భర్తకు విడాకులు ఇచ్చినా, భర్త చనిపోయినా తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుంది. తండ్రి 2005 సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ వరకు జీవించి ఉంటే మాత్రమే ఆస్తిలో హక్కు పొందే అవకాశం ఉంటుంది.
తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిని కూతురికి ఇవ్వాలా? వద్దా? అనేది తండ్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే మాత్రం కూతురు కూడా ఆస్తిలో హక్కును కలిగి ఉంటుంది. పూర్వీకుల ఆస్తిపై కుమార్తెకు పూర్తిస్థాయిలో హక్కు ఉంటుంది. అయితే తండ్రి ఇష్టాన్ని బట్టి తండ్రి సంపాదించిన ఆస్తిలో కూతురు వాటా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
కుటుంబ సంఘర్షణలను నివారించాలని భావించే తల్లీదండ్రులు వీలునామా రాయడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో వీలునామాలో పేర్కొనడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.