Health Protect: మనం రోజు తీసుకునే ఆహారమే మనకు ఔషధంగా మారుతుంది. మంచి ప్రొటీన్లు, మినరల్స్ ఉన్నఆహారం తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లదు. అంతేకాని ఏవో పనికి రాని వాటిని తీసుకుంటే కచ్చితంగా అవి దేహంపై చెడు ఫలితాన్నే ఇస్తాయి. ఫలితంగా మనం నూరేళ్లు జీవించాల్సి ఉన్నా యాభై ఏళ్లకే కాలం చేయడం జరుగుతుంది. అందుకే మన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రయోజనం. ఈ నేపథ్యంలో మనం రోజు తీసుకునే ఆహారంలో పప్పులు ఉండేలా చూసుకుంటే కూడా మంచి లాభాలు ఉన్నట్లు తెలుస్తోంది. పప్పులు మన దేహానికి ఎంతో మేలు కలిగిస్తాయి. మనల్ని రోగాల బారి నుంచి కాపాడతాయనడంలో సందేహం లేదు.
Also Read: Pragya Jaiswal: ఉల్లిపొర కన్నా పలుచనైన డ్రెస్ లో పరువాలన్నీ కనిపించేలా.. అఖండ బ్యూటీ ప్రగ్యా అరాచకం
ఇందులో కాబూలీ శనగలు అత్యంత బలమైనవిగా చెబుతారు. కాబూలీ శనగలు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే వాటితో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. కాబూలీ శనగలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. చెడు కొవ్వును తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బుల ముప్పు వాటిల్లకుండా ఉంటుంది. ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువగానే తీసుకుంటే ఎక్కువ లాభాలు కలుగుతాయి. దీన్ని గుర్తించి మనం జాగ్రత్తగా ఉండాలి. దొరికాయని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. మితంగా తినడమే మనకు కావాలి. ఇంకా పప్పులు కూడా మనకు ఎంతో మేలును కలిగిస్తాయి. కంది, పెసర, బబ్బర, చిక్కుడు, మినప పప్పులను మనం తీసుకోవచ్చు. వీటితో మనకు ఎన్నో రకాల లాభాలు కనిపిస్తాయి. మహిళలకు రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధించే శక్తి వీటిలో ఉంటుందని తెలుసుకోవాలి. ప్రొస్టేట్, మల ద్వార క్యాన్సర్లు వంటివి రాకుండా పప్పులు నిరోధిస్తాయి. వీటిలో రక్తంలో చెడు కొవ్వును తగ్గించే గుణం కూడా దాగి ఉంది. అందుకే పప్పులు ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్న సంగతి తెలుసుకోవాలి.
Also Read: Polygamy Legal in Eritrea: ప్రతీ మగాడు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోవాలట.. త్వరపడండి
మరో పప్పు ధాన్యం ఉలవలు. ఇందులో ఇనుము, కాల్షియం, మాలిబ్లినమ్ వంటి ప్రొటీన్లు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉండటంతో వీటితో బలం ఎక్కువే. క్యాన్సర్ల నిరోధానికి పాటుపడతాయి. కొవ్వు, కడుపు ఉబ్బరం తగ్గడానికి పనిచేస్తాయి. అందుకే ఉలవలను కూడా ఆహారంగా తీసుకుంటే ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. ఉలవలు వర్ష, చలికాలాల్లో తీసుకుంటే వేడి కూడా పుడుతుంది. దీంతో మనకు ప్రయోజనం చేకూరుతుంది.
Also Read: Eenadu: సండే స్పెషల్: ఇప్పటికీ ఆ పత్రికే నెంబర్ వన్.. ఇది ఎలా సాధ్యం?
పప్పుల్లో అత్యంత ప్రొటీన్లు ఉన్నవి సోయాబీన్స్. ఇందులో ఉండే పోషకాలతో ఎన్నో రకాల లాభాలు ఉన్న సంగతి తెలిసిందే. కండరాల పుష్టికి సోయాబీన్స్ ఎంతగానో తోడ్పడతాయి. ప్రస్తుతం రోజు తీసుకునే ఆహారంలో వీటి శాతం ఉండాల్సిందే. కానీ ఎక్కువ మోతాదులో కాకుండా పరిమితంగా తీసుకుంటేనే మేలు చేస్తోంది. వీటితో తయారు చేసిన పాలు మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయనడంలో సందేహం లేదు. పప్పులను వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇందుకు గాను ప్రతి రోజు ఏదో ఒక పప్పును ఆహారంగా తీసుకుంటే ఎంతో లాభం కలుగుతుందని గుర్తుంచుకోవాలి.