https://oktelugu.com/

Goddess Lakshmi : లక్ష్మీదేవికి దీపారాధన ఏ రోజుల్లో చేయాలో తెలుసా?

Goddess Lakshmi : మనలో చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. ఎంత సంపాదించినా సరిపోవడం లేదని బాధ పడుతుంటారు. కొందరికి కష్టపడకపోయినా సంపద వస్తుంది. కానీ మనం ఎంత కష్టపడినా రావలసినంత రాదు. వచ్చింది నిలవదు. దీంతో నెలంతా ఇబ్బందులే. ఏం చేయాలో పాలుపోదు. ప్రస్తుత కాలంలో ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలనే ఆలోచనలో చాలా మంది ఉంటున్నారు. దీనికి కూడా చక్కని పరిష్కార మార్గాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 17, 2023 / 09:26 AM IST
    Follow us on

    Goddess Lakshmi : మనలో చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. ఎంత సంపాదించినా సరిపోవడం లేదని బాధ పడుతుంటారు. కొందరికి కష్టపడకపోయినా సంపద వస్తుంది. కానీ మనం ఎంత కష్టపడినా రావలసినంత రాదు. వచ్చింది నిలవదు. దీంతో నెలంతా ఇబ్బందులే. ఏం చేయాలో పాలుపోదు. ప్రస్తుత కాలంలో ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలనే ఆలోచనలో చాలా మంది ఉంటున్నారు. దీనికి కూడా చక్కని పరిష్కార మార్గాలు కనిపిస్తున్నాయి.

    దీపారాధన ఎలా చేయాలి?

    చాలా మంది దీపారాధన చేస్తారు. కానీ సరైన విధంగా చేయరు. దేవుడిని కొలిచే క్రమంలో తప్పులు లేకుండా చూసుకుంటేనే మంచిది. మనం చేసే పని సరైన విధంగా చేయకపోతే మనకు నష్టాలే వస్తాయి. అదే మనం చేసే పని సక్రమమైన పద్ధతిలో చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు వస్తాయి. మన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మంగళ, శుక్రవారాలు ఆవు నేతితో దీపారాధన చేస్తే సంపదలు కలుగుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇది కూడా సరైన విధంగా చేయడం వల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది.

    పూజ ఎలా చేయాలి?

    ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి. అందుకే అందరు ఆమెను కొలిచేందుకే ఇష్టపడతారు. తమ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేయాలని ఆశిస్తుంటారు. లక్ష్మీదేవికి చేసే పూజలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు. లక్ష్మీదేవికి ఆవునెయ్యి అంటే ఎంతో ప్రీతి. అందుకే మనం ఆవునేతితో దీపారాధన చేయడం ఉత్తమం. దీపాన్ని అగ్గిపుల్లో వెలిగించకూడదు. అగర్ వత్తిని వెలిగించి దాంతో దీపాన్ని ముట్టించాలి. అంతేకాని నేరుగా దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించడం సరైన పద్ధతి కాదు. ఇది అందరు గుర్తుంచుకోవాలి.

    ఇంకా ఏం ప్రయోజనాలు?

    ఆవునేతితో దీపారాధన చేయడం వల్ల ఆర్థిక వృద్ధి కలుగుతుంది. మంగళవారం ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవి చిత్ర పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగించి పూజించడం వల్ల రావాల్సిన బకాయిలు త్వరగా వసూలవుతాయి. పిల్లలు సరస్వతి పటం ముందు నేతి దీపం వెలిగిస్తే చదువులో వాళ్లు రాణిస్తారు. ఇలా మంగళవారం, శుక్రవారం దీపారాధన చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. మహిళలు ఈ విషయం తెలుసుకుని తమ బాధల నుంచి విముక్తి కావడానికి ఈ మార్గాన్ని అనుసరించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలని ప్రయత్నించడం మంచిదే.