https://oktelugu.com/

Eggs: గుడ్డు తింటే కొవ్వు పెరుగుతుందా? ఇందులో నిజమెంత?

గుడ్డు తినడం వల్ల మన గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో మనకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో గుడ్డు పాత్ర ప్రధానంగా నిలుస్తుంది. గుడ్డు కూరగా చేసుకునే సమయంలో ఎక్కువ నూనె పోయడం వల్ల మనకు నష్టం కలుగుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 14, 2023 6:58 pm
    Eggs

    Eggs

    Follow us on

    Eggs: మనకు గుడ్డు బలమైన ఆహారం. అందుకే రోజుకో గుడ్డు తినాలని వైద్యులే చెబుతున్నారు. కోడిగుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కోడిగుడ్డు కొందరు శాఖాహారమంటే మరికొందరు మాత్రం ఇది మాంసాహారమే అని అంటున్నారు. ఏది ఏమైనా గుడ్డులో ఉండే సహజమైన కొవ్వు మనకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

    గుడ్డు తినడం వల్ల మన గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో మనకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో గుడ్డు పాత్ర ప్రధానంగా నిలుస్తుంది. గుడ్డు కూరగా చేసుకునే సమయంలో ఎక్కువ నూనె పోయడం వల్ల మనకు నష్టం కలుగుతుంది. తక్కువ నూనెతోనే ఉడికించుకోవాలి.

    గుడ్లు రోజుకు ఎన్ని తినాలి? ఎన్ని తింటే ఆరోగ్యం కలుగుతుంది అనే ప్రశ్నలకు కూడా సమాధానం ఉంది. రోజుకు కనీసం రెండు గుడ్లు తింటే మంచిది. అల్పాహారంలో గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి శ్రేయస్కరం. అంతకు ఎక్కువ గుడ్లు తినాలంటే వైద్యుల సలహా తప్పనిసరి. ఈ నేపథ్యంలో గుడ్డును తినడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని గుర్తుంచుకోవాలి.

    కొవ్వును పెంచే ఆహారాలను దూరం చేసుకోవాలి. మాంసాహారాలు తక్కువగా తినాలి. మాంసంలో కొవ్వు పుష్కలంగా ఉంటుంది. అందుకే వాటిని పరిమితంగానే తీసుకోవాలి. పాలలో కూడా కొవ్వు ఉంటుంది. వాటికి కూడా దూరంగా ఉంటేనే మంచిది. ఇంకా ఆయిల్ ఫుడ్స్ కు కూడా దూరంగా ఉండాలి. ఇలా మనం ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది.