https://oktelugu.com/

Corona Virus: కరోనా తగ్గినా ఆ ఆరోగ్య సమస్య వేధిస్తోందా.. చెక్ పెట్టే చిట్కాలివే?

Corona Virus: కరోనా వైరస్ ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామందిని వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. తరచూ మందులు వాడుతున్నా సమస్య తగ్గకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 10 నుంచి 15 శాతం మందిని ఈ సమస్య వేధిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా వల్ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 17, 2022 / 04:41 PM IST
    Follow us on

    Corona Virus: కరోనా వైరస్ ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామందిని వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. తరచూ మందులు వాడుతున్నా సమస్య తగ్గకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

    Corona Virus

    కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 10 నుంచి 15 శాతం మందిని ఈ సమస్య వేధిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా వల్ల లంగ్స్ లో కణజాలం గట్టిపడితే కూడా ఈ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అలర్జీ పరీక్షలు, ఛాతీ ఎక్స్ రే ద్వారా సమస్యను గుర్తించే అవకాశాలు అయితే ఉంటాయి. ఆస్తమా వల్ల దగ్గు వస్తుందా లేక అలర్జీ వల్ల వస్తుందా తెలిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

    Also Read: భీమ్లానాయ‌క్‌కు పెంచిన రేట్లు వ‌ర్తించ‌వా.. జ‌గ‌న్ ప్లాన్ ఇదేనా..?

    అవసరమైతే ఊపిరితిత్తుల సామర్థ్యానికి సంబంధించిన స్పైరోమెట్రీ పరీక్షను చేయించుకోవాలి. సరైన మందులను వాడటం ద్వారా సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఏయే సమయాల్లో దగ్గు వస్తుందో తెలిస్తే కూడా సమస్యను గుర్తించడం తేలిక అవుతుంది. దుమ్ము, ధూళి సమస్యల వల్ల కూడా కొన్నిసార్లు శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే చాన్స్ అయితే ఉంటుంది.

    మందులు వాడినా తగ్గకపోతే సమీపంలోని పల్మనాలజిస్ట్ ను సంప్రదించి సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. కంగారు పడకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడినా సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

    Also Read: ఎన్టీఆర్ ఇమేజ్‌ను వాడుకునే ప‌నిలో జ‌గ‌న్‌.. పెద్ద ప్లానే వేశారే..!