
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు పెద్దలు. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి కంటి సంబంధిత సమస్యలు వస్తే ఆ సమస్య తీరే వరకు ఎంతో నొప్పిగా ఉంటుంది. కంట్లో చిన్న నలక పడినా ఆ నలక పోయేంత వరకు పడే బాధ అంతాఇంతా కాదు. అయితే ఒక వ్యక్తి కంట్లో మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20కు పైగా పురుగులు నివాసం ఏర్పరచుకున్నాయి.
ఎవరైనా కంటి దురద సమస్యతో బాధ పడుతుంటే మీ కంట్లో కూడా పురుగులు ఉండవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దురద సమస్య పదేపదే వేధిస్తుంటే పరీక్షలు చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అలా చేయించుకోకపోతే కంటికే ప్రమాదమని తెలుపుతున్నారు. చైనాలో ఒక వ్యక్తి కంట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పురుగులు కనిపించడంతో వైద్యులు సైతం అవాక్కయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే చైనాలో వాన్ అనే 60 సంవత్సరాల వ్యక్తి కళ్లు దురద పెడుతుండటంతో సుజౌ హాస్పిట కు వెళ్లాడు డాక్టర్ జి టింగ్ అతనికి కంటి పరీక్షలు చేసి అతని కంట్లో నులి పురుగులు ఉన్నట్లు గుర్తించాడు. అనంతరం జి టింగ్ శస్త్రచికిత్స ద్వారా అతని కంట్లో ఉన్న 20 నులి పురుగులను తొలగించారు. కుక్కలు, పిల్లుల కళ్లలో కనిపించే ఆ పురుగులు వాన్ కళ్లలో కనిపించడంతో ఆశ్చర్యపోయామని తెలిపారు.
వాన్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ తాను ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం లేదని.. బయటినుంచే పురుగులు తన కంట్లోకి చేరి ఉండవచ్చని తెలిపారు. డాక్టర్ మాట్లాడుతూ ఎవరైతే పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారో వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.