Natural Beauty Tips: మన అందాన్ని ఆరోగ్యాన్ని మన శరీరమే నిర్ణయిస్తోంది. మరి మన శరీరంలో బోలెడు ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. నిత్యం ఎన్నో క్రియలు, ప్రతిక్రియలు జరుగుతూ ఉంటాయి. మరి మనం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. ముందు మనం ఏమి చేయాలో.. ? అలాగే ఏమి చేయకూడదో తెలుసుకోవాలి.
మరి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసుకుందాం.
1. లేవగానే గ్లాసు మంచినీళ్లు తాగండి
2. నిద్రపోయే ముందు శ్వాసపై దృష్టి పెట్టండి
3. కోపంలో ఉన్నప్పుడు అంకెలు లెక్కపెట్టండి.
4. బాధలో ఉన్నప్పుడు ఇతర విషయాలపైకి డైవర్ట్ అవండి
5. బాధ ఎక్కువగా ఉంటే ఆ సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోండి
6. మిమ్మల్ని ఎవరైనా అవమాన పరుస్తుంటే.. మాట్లాడటం ఆపేయండి
Also Read: ఎక్స్ క్లూజివ్ : ‘రష్మీ గౌతమ్’ కి పెళ్లి అయిపోయింది.. మరి ఎందుకు దాచింది ?
7. అలాగే మీరు కూల్ డ్రింక్స్ తాగడం మానేసి, తాజా పండ్ల రసాలను తాగడం అలవాటు చేసుకోండి.
8. అలాగే బాడీలో హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు.. వేడి వేడి టీకి బదులుగా, నిమ్మకాయ ఐస్ టీ, జీరా నీరు, లస్సీ, మజ్జిగ లాంటివి తాగాలి.
9. ఇక చక్కెరతో నిండిన డెజర్ట్ లను వాడొద్దు. వాటి బదులుగా పెరుగులో తేనే కలిపి తీసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.
10. ప్రస్తుతం కాలుష్యం ఎక్కువ అయిపోయింది. ఈ కాలుష్యం నుంచి మనల్ని మనం కడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
11. అదే విధంగా జంక్ ఫుడ్ అలవాట్లతో ఆరోగ్యం దెబ్బ తింటుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని కోల్పోతాం. కాబట్టి ఇలాంటి ఆహార అలవాట్లు మానుకోవాలి.
12. మొలకెత్తిన తృణధాన్యాలు, పప్పులు, కాయలు ఎక్కువగా తినాలి.
Also Read: ఓటీఎస్‌పై కొనసాగుతున్న రగడ.. సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ..