Health tips in telugu: సాధారణంగా ప్రతి ఒక్క పండులో ఎన్నో రకాల పోషక విలువలు విటమిన్స్ మినరల్స్ ను కలిగి ఉంటాయి.ఇలా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి పండ్లను ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే కొన్ని పండ్లను కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు తినకూడదని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో బొప్పాయి ఒకటి.బొప్పాయిలో ఎన్నో పోషక విలువలు ఉండి ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు.అయితే ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ బొప్పాయిని కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు తినకూడదు. మరి ఎలాంటి వారు బొప్పాయికి దూరంగా ఉండాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
బొప్పాయిలో ఎన్నో ఔషధగుణాలు ఉన్నప్పటికీ గర్భం దాల్చిన స్త్రీలు బొప్పాయిని తినకూడదు. బొప్పాయి ఎంతో వేడి చేయటమే కాకుండా ఇందులో ఉన్నటువంటి పపాలిన్ హార్మోన్ గర్భస్రావానికి కారణం అవుతుంది కనుక గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు. ఇక గుండె చప్పుడులో సమస్యలు ఉన్నవారు,ఇతర గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు బొప్పాయిని తినకూడదని నిపుణులు చెబుతారు. గుండె చప్పుడు అధికంగా ఉన్న వారు బొప్పాయి తినడం వల్ల మరింత దడగా ఉంటుంది.
Also Read: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంట ఇదే..?
సాధారణంగా బొప్పాయి చర్మ కాంతిని మెరుగు పరుస్తుంది. కానీ లాటెక్స్ అలెర్జీతో బాధపడుతున్న రోగులకు బొప్పాయి తినడం చాలా హానికరం. ఇందులో ఉన్న ఎంజైములు క్రాస్ రియాక్షన్స్ జరపడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారు బొప్పాయికి దూరంగా ఉండాలి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. బొప్పాయి ఎంతో తీపిగా ఉండటం వల్ల మధుమేహంతో బాధపడే వారు బొప్పాయి తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మధుమేహంతో బాధపడే వారు బొప్పాయికి దూరంగా ఉండాలి.
Also Read: గుడ్లను ఎక్కువగా తింటున్నారా.. ఈ తప్పు చేస్తే ప్రాణాలకే ప్రమాదం?