Banana Fruits:సాధారణంగా మనం మార్కెట్ నుంచి కొన్ని పండ్లను తెచ్చుకున్నప్పుడు ఆ పండ్లను ఒక బుట్టలో వేసి డైనింగ్ టేబుల్ పై లేదా ఫ్రిజ్ పై పెడతాము ఈ క్రమంలోని నారింజ, ఆపిల్ ,బనానా సపోటా పండ్లు అన్నింటినీ కలిపి ఒకే చోట పెడుతుంటారు. ఇలా అన్నింటినీ ఒకే చోట కలిపి పెట్టే వారు తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. సైన్స్ ప్రకారం ఆలోచిస్తే ఈ విధంగా అరటి పండ్లతో కలిపి ఇతర పండ్లను పెట్టడం సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎందుకు పెట్టకూడదనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….
అరటి పండు త్వరగా పక్వానికి రావడానికి అరటి పండ్ల పై ఈథేన్ వాయువును వేయటం వల్ల అరటి పండ్లు తొందరగా పక్వానికి వస్తాయి. ఈ క్రమంలోనే అరటిపండు నుంచి ఈథేన్ గ్యాస్ వెలువడుతుందని సైన్స్ చెబుతోంది. ఈ క్రమంలోనే అరటి పండ్లతో పాటు వేరే పండ్లను కూడా అక్కడ ఉంచడం వల్ల ఈ గ్యాస్ ప్రభావం ఆ పండ్లపై పడి అవి కూడా తొందరగా పండిపోతాయి. అలాగే ఆ పండ్ల పై కూడా ఈ రసాయన ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే అరటి పండ్లతో పాటు మిగతా పండ్లను కలిపి పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా కలిపి పెట్టడం వల్ల అరటిపండ్లతో పాటు మిగతా పండ్ల కూడా తొందరగా పండిపోయి కుళ్ళి పోవడమే కాకుండా, ఆ పండ్ల పై కూడా ఈథేన్ గ్యాస్ ప్రభావం పడుతుంది అందుకోసమే అన్ని పండ్లను కలిపి ఒక చోట పెట్టకూడదు. అరటిపండ్లపై పరిశోధనల సాగిస్తున్న యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్ పరిశోధకులు డాక్టర్ డాన్ బెబర్ తెలిపిన సమాచారం ప్రకారం అరటిపండులో పాలీఫెనాల్ ఆక్సిడేస్ ఎంజైమ్ ఉంటుంది. ఇది అరటి పండులో ఉండే ఫినాలిక్ రసాయనాన్ని ఆక్సిజన్ సహాయంతో క్వినోన్‌లుగా మార్చడం వల్ల అరటిపండు తొందరగా చాక్లెట్ రంగులోకి మారుతుందని తెలిపారు.