Curd: ప్రస్తుత కాలంలో జీవనశైలి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. మనం మంచి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే కొన్నిసార్లు ఆహారం తీసుకునే విషయంలో చేసే చిన్నచిన్న తప్పుల వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందనే సంగతి తెలిసిందే.
పెరుగు, చేపలలో ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు ఉంటాయి. పెరుగు, చేపలు తీసుకుంటే గ్యాస్, అసిడిటీ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాలు, పెరుగు కలిపి తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాలు, పెరుగు కలిపి తీసుకుంటే డయేరియా, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఉల్లిపాయతో కలిపి పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఉల్లిపాయ, పెరుగు కలిపి తీసుకుంటే సొరియాసిస్, దద్దుర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మామిడి పండ్లతో కలిపి పెరుగును తీసుకోకూడదు. పెరుగు, మామిడి పండ్లు కలిపి తీసుకుంటే అలర్జీ, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.