Yawn During Pooja: మనం దేవుడికి పూజలు చేస్తుంటాం. పూజలో ఎక్కువ సేపు ఉండటం వల్ల మనకు ఆవలింతలు వస్తుంటాయి. దీంతో ఇదేదో అరిష్టంగా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గంటల తరబడి కూర్చుంటే సహజంగానే శరీరానికి బడలిక ఉండకపోవడంతో ఆవలింతలు రావడం మామూలే. కొందరు వీటిని ఏదో చెడుగా అనుకుంటారు. కానీ దీనికి అంతటి నష్టమేమీ లేదని గుర్తుంచుకోవాలి. కావాలని ఎవరు కూడా ఆవలింతలు తీయరు. శరీరం మత్తుగా ఉన్నప్పుడే ఆవలింతలు వస్తాయని తెలిసిందే. ఎక్కువ సేపు కదలకుండా ఉండటం వల్ల ఆవలింతలు రావడం జరుగుతుందని తెలుస్తోంది. ఆవలింతలతో అదేదో తప్పుగా భావించడం చేయడం కూడదని చెబుతున్నారు.
ఆవలింత తీసినప్పుడు అవతలి వారి దృష్టి మళ్లుతుందని తెలుస్తోంది. ఇంకా కొందరైతే ఇక చాలు అనే అర్థం వస్తుందని నమ్ముతుంటారు. అందుకే ఆవలింతలు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎక్కువగా పూజలు, వ్రతాలు, జపాలు చేసేటప్పుడే మనకు ఆవలింతలు వస్తాయి. పూజలో మనం కొట్టే కొబ్బరికాయ కుళ్లిపోతే అదేదో అరిష్టమని నమ్ముతారు. అందులో కూడా వాస్తవం లేదు. ఎందుకంటే ఎవరు కూడా దురుద్దేశంతో కుళ్లిన కొబ్బరికాయ కొట్టరని తెలుసుకోవాలి. పూజ ఎంత శ్రద్ధగా చేస్తున్నామో కొబ్బరికాయ కూడా అంతే శ్రద్ధతో కడుతుంటాం. దీంతో కొబ్బరికాయ ఎలా ఉన్నా దానికి మనం బాధ్యులం మాత్రం కాదని తెలుసుకోవాలి.
Also Read: Priyanka Singh: ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ పెళ్లి… వరుడు ఎవరంటే? హల్దీ ఫోటోలు వైరల్
పురాణాలు వింటున్నప్పుడు కూడా ఆవలింతలు వస్తుంటాయి. చెడు పనులు చేసేటప్పుడు మాత్రం నిద్ర రాదు. దైవ చింతనలో ఉన్నప్పుడు ఎందుకు ఆవలింతలు వస్తాయని చాలా మందిలో అనుమానాలు వస్తాయి. భగవంతుడి దీవెనలు మనమీద పడటంతోనే ఆవలింతలు వస్తాయని మన వారు చెబుతుంటారు. భగవంతుడి మీద మన ధ్యాస ఎక్కువగా ఉండటంతో కాస్తంత విశ్రాంతి కోసం ఆవలింతలు వస్తాయని తెలిసిందే. కానీ దీన్ని కూడా కొందరు ఏదో జరిగిపోతున్నట్లుగా భావించి భయపడటం చేస్తుంటారు.
పూజలు చేసేటప్పుడు వచ్చే ఆవలింతలకు ఎలాంటి దోషాలు ఉండవని తెలుస్తోంది. దైవ పూజలో ఉన్నప్పుడు మన దృష్టి మొత్తం భగవంతుడి మీదే ఉంటుంది. దీని వల్ల ఎటువంటి కీడు ఉండదని తెలిసిందే. పూజ చేసేటప్పుడు ఆవలింతలు వస్తే ఎలాంటి ఉపద్రవం రాదని తెలుసుకోవాలి. ఎలాంటి దోషాలు కూడా రావని గ్రహించుకోవాలి. ఆవలింతలకు ఎలాంటి అన్వయాలు లేవని గ్రహించుకుని భగవంతుడి మీద విశ్వాసంతో పూజ చేస్తే ప్రయోజనం కలుగుతుంది. దీనికి ఎలాంటి ఉద్దేశాలు ఆపాదించుకోవడం సరికాదని చెబుతున్నారు.