https://oktelugu.com/

Nightmares : మనం నిద్రలో ఉన్నప్పుడు భయం ఎందుకు కలుగుతుందో తెలుసా?

రాత్రి నిద్రలో మనకు ఎవరో మన మీద కూర్చుని మన గొంతు పిసికినట్లు అనిపిస్తుంది. దీంతో మనం భయంతో అరవాలని అనుకుంటాం. కానీ మన గొంతు కూడా పెకలదు

Written By:
  • NARESH
  • , Updated On : May 3, 2023 / 11:41 AM IST
    Follow us on

    Nightmares : మనం రాత్రి పూట నిద్రపోతుంటాం. పగటిపూట పనిచేస్తుంటాం. ఇలా నిద్రలోకి జారుకున్నాక మనకు కలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఎక్కడికో వెళ్తుంటాం. ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. ఏదో ప్రమాదాల్లో పడినట్లు అనిపిస్తుంది. కలలో కొందరు కలవరిస్తుంటారు. ఎవరో పట్టుకున్నట్లు అనిపిస్తుంది. దీంతో మనకు తెలియకుండానే భయం ఆవహిస్తుంది. నిద్రలో మనకు ఏం జరుగుతుందో తెలియదు.

    కలలో ఇలా మనకు విచిత్రమైన కలలు వస్తాయి. ఒక్కోసారి ఆనందం ఇంకోసారి బాధలకు సంబందించిన కలలు రావడం సహజమే. కానీ రాత్రి నిద్రలో మనకు ఎవరో మన మీద కూర్చుని మన గొంతు పిసికినట్లు అనిపిస్తుంది. దీంతో మనం భయంతో అరవాలని అనుకుంటాం. కానీ మన గొంతు కూడా పెకలదు. ఈ నేపథ్యంలో మనం పడే భయాన్ని స్లీప్ పెరాలసిస్ అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు.

    కొన్నేళ్లక్రితం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో ఊరి ప్రజలకు దెయ్యం పట్టిందని దాన్ని ఊరి నుంచి పంపేందుకు ఏకంగా పూజలు చేయడం విశేషం. ఇలా మూఢనమ్మకాల జాడ్యంలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. కానీ వైద్య పరిభాషలో దీన్ని స్లీప్ పెరాలసిస్ అని పిలుస్తారని చెబుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు.

    ఈ సమస్య మన దేశంలోనే కాదు అమెరికాలో కూడా ఉంది. భయం కలిగినప్పుడే మనలో కలిగే ఆందోళనే దీనికి కారణం. కానీ దీనికి కచ్చితమైన ఆధారాలు మాత్రం ఉండవు. మనిషిలో భయం కలిగినప్పుడు ఏర్పడే ఫీలింగే ఇది. ఇది దాదాపు 80 సెకన్ల పాటు ఉంటుంది. దెయ్యాలంటే భయం ఉన్న వారికి ఇలాంటి కలలు రావడం సహజమే. కానీ అనవసరంగా భయపడి దానికి కంగారు పడాల్సిన పనిలేదు.