Devotional: పూజకు పువ్వులు ఎందుకు వినియోగిస్తారో తెలుసా?

Devotional: పువ్వులకు దేవుడికి అవినాభావ సంబంధం ఉంటుంది. పూజ చేసే సమయలో ప్రతి వారు పూలను వాడటం మన ఆచారం. హిందూ సంప్రదాయంలో పూజకు పూలకు ఎంతో సంబంధం ఉంటుంది. పువ్వులతో పూజ చేస్తేనే దేవుడికి ముడుతుందని విశ్వాసం. అందుకే మనవారు పూజలో పువ్వులను ప్రధానంగా వాడతారు. కానీ పువ్వుల వాడకంలో కూడా కొన్ని నియమాలు ఉండటం అందరికి తెలియవు. ఎందుకంటే తమకు దొరికిన పూలతోనే పూజలు చేయడం చూస్తుంటాం. సనాతన సంప్రదాయాల్లో భాగంగా దేవుడిని కొలవడం […]

Written By: Srinivas, Updated On : March 21, 2022 7:56 pm
Follow us on

Devotional: పువ్వులకు దేవుడికి అవినాభావ సంబంధం ఉంటుంది. పూజ చేసే సమయలో ప్రతి వారు పూలను వాడటం మన ఆచారం. హిందూ సంప్రదాయంలో పూజకు పూలకు ఎంతో సంబంధం ఉంటుంది. పువ్వులతో పూజ చేస్తేనే దేవుడికి ముడుతుందని విశ్వాసం. అందుకే మనవారు పూజలో పువ్వులను ప్రధానంగా వాడతారు. కానీ పువ్వుల వాడకంలో కూడా కొన్ని నియమాలు ఉండటం అందరికి తెలియవు. ఎందుకంటే తమకు దొరికిన పూలతోనే పూజలు చేయడం చూస్తుంటాం.

సనాతన సంప్రదాయాల్లో భాగంగా దేవుడిని కొలవడం ఒక నియమం. కానీ అది నెరవేర్చే క్రమంలో కొన్ని సంప్రదాయాలు పాటించడం తెలిసిందే. పూలు వాడే సమయంలో కూడా కొన్నింటిని పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఇందులో ప్రధానంగా కింద పడిన పూలను వాడరాదు. బాలింతలు, నెలసరి అయిన వారు కూడా వాటిని తాకరాదు. పువ్వులను వాసన చూడరాదు. వాడిన వాటిని కూడా వినియోగించరాదు.

Also Read:  కేసీఆర్ తో గ్యాప్.. సమ్మక్క-సారక్క వివాదంపై చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్

మందార, ఎర్రగన్నేరు, చామంతి, నందివర్ధనం, తామర, పారిజాతాలు, నీలాంబరాలు, నిత్యమల్లె మొదలైనవి దేవుడి పూజలో వాడేందుకు పనికొస్తాయి. శివుడి పూజకు మారేడు, విష్ణువు పూజకు తులసీదళాలు, వినాయకుడు, సూర్య భగవానుడికి తెల్లజిల్లేడు, లక్ష్మీదేవికి తామర పువ్వులతో పూజ చేస్తే ప్రతిఫలం ఉంటుందని తెలుసుకోవవాలి. మగవారు పూజ చేసేటప్పుడు కంఠానికి గంధం ధరించి చెవిలో పువ్వు పెట్టుకుని పూజ చేయడం ఆనవాయితీ.

Devotional

ఆడవారు ఎప్పుడు కూడా జుట్టులో తులసీదళాలు పెట్టుకుని పూజ చేయరాదని శాస్త్రాలు సూచిస్తున్నాయి. పూజలో పువ్వులను వాడటం మంచిదే కానీ నియమాల ప్రకారం వాడి భగవంతుడి కృపకు పాత్రులు అయ్యేందుకు పురుషులైనా, స్త్రీలైనా తమ భక్తి మేరకు శక్తి వంచన లేకుండా పూజ చేసి నీరాజనాలు అందుకోవచ్చు. పూలు, పండ్లు నైవేద్యంగా పెట్టి భగవంతున్ని ప్రసన్నం చేసుకుంటారు. దీంతో దేవుడికి తమ గోడు వెళ్లబోసుకుని మంచి చేయాలని కోరుకోవడం తెలిసిందే.

Also Read: రాబోయే ఎన్నికలే లక్ష్యం.. ప్రజలతో మమేకం కావాలని జగన్ పిలుపు

Tags