Sleep : మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. నిద్ర పోయే భంగిమ కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. మనం రోజు చేసే దైనందిన కార్యక్రమాలతో బిజీగా ఉంటాం. దీంతో మనం చేసే పనుల విషయంలో శ్రద్ధ తీసుకోం. కానీ మనం చేసే పనులు కూడా మనకు మేలు చేస్తాయి. అంటే సరైన విధంగా పనులు చేస్తే దాని ఫలితాలు కూడా మనకు చక్కగా అందుతాయి. దీంతో మనకు నెగెటివ్ కంటే పాజిటివ్ ఎక్కువగా వస్తుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మనం రోజు నిద్రపోయే భంగిమ గురించి తెలుసుకుందాం.
ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిది
మనం పడుకునే సమయంలో కొందరు వెల్లకిలా పడుకుంటారు. మరికొందరు బోర్లా పడుకుంటారు. ఇంకొందరు కుడివైపుకు తిరిగి పడుకుంటారు. ఇంకా ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం సాధారణం. ఈ భంగిమలన్నింటిలో ఎడమ వైపు తిరిగి పడుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో మనకు చాలా ప్రయోజనాలు దాగి ఉన్నాయని చెబుతున్నారు.
ఎందుకు మంచిది?
ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మన శరీరానికి రక్తసరఫరా బాగుంటుంది. అన్ని అవయవాలకు మంచిగా రక్తం అందడంతో అవి మనం నిద్రపోయినా పనులు చేసుకుంటాయి. ఇలా మనకు అనేక లాభాలు కలుగుతాయి. అందుకే పడుకునే సమయంలో మనం ఎడమ వైపుకు తిరిగి పడుకోవడంలో ఉన్న బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి.
కుడివైపు తిరిగి..
కుడివైపుకు తిరిగి పడుకుంటే మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. శరీరంలోని మలినాలు బయటకు పోవు. దీంతో ఇబ్బందులు తలెత్తుతాయి. జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఫలితంగా మనకు సమస్యలు రావడం ఖాయం. అందుకే ఎడమ వైపు తిరిగి పడుకోవడానికి మొగ్గు చూపాలని ఆరోగ్యాభిలాషుల సూచన.