Homeహెల్త్‌Basil Plant : తులసి మొక్కను ఎటు వైపు నాటుకుంటే మంచిదో తెలుసా?

Basil Plant : తులసి మొక్కను ఎటు వైపు నాటుకుంటే మంచిదో తెలుసా?

Basil Plant : మనం వాస్తు శాస్త్రాన్ని నమ్ముతాం. ఇల్లు కట్టుకునే సందర్భంలో ప్రతిది వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఏ చిన్న పొరపాటు జరిగినా ఫలితాలు తీరుమారవుతాయి. అందుకే పక్కా వాస్తు ఉండాలని కోరుకోవడం సహజం. ఈ నేపథ్యంలో మన ఇంటిలో ఉండే వస్తువులు, చెట్లు, మొక్కల గురించి కూడా శ్రద్ధ తీసుకుంటాం. ఈ నేపథ్యంలో ఇంట్లో పెంచుకునే తులసి మొక్క గురించి తెలుసుకుందాం.

తులసిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపంగా చెబుతారు. ఆయనకు తులసీమాల వేసేందుకు ఇష్టపడతారు. తులసిలో లక్ష్మీదేవి కూడా కొలువుంటుందని నమ్మకం. అందుకే తులసి మన జీవితంతో ముడిపడి ఉంది. తులసి ఇంట్లో ఉంచుకుంటే మనకు అనుకూల ఫలితాలే వస్తాయి. చెడును దూరం చేసే గుణం తులసిలో ఉంటుందని విశ్వాసం.

తులసిని ఎటు వైపు పెంచుకోవాలి? ఏ వైపు పడితే ఆ వైపు తులసిని పెంచుకోవడానికి వాస్తు శాస్త్రం ఒప్పుకోదు. తులసిని ఉత్తరం, ఈశాన్యం, తూర్పు వైపుల్లో మాత్రమే పెంచుకోవాలి. దక్షిణం వైపు పెంచితే మనకు నష్టాలు వస్తాయి. పశ్చిమం వైపు కూడా పెంచుకోవడం సురక్షితం కాదు. తులసి మొక్కను పెంచుకునే క్రమంలో ఈ నిబంధనలు పాటించాలి.

తులసి మొక్క ఎండిపోతే కూడా అరిష్టంగానే చెబుతారు. తులసి మొక్క ఎండిపోతే దాన్ని తీసి పారే నీళ్లలో వేయడం వల్ల మనకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలా చేయడం కుదరకపోతే గొయ్యి తీసి మట్టిలో పాతిపెడితే మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపద సమ‌ృద్ధిగా కలగాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి ప్రయోజనాలు దక్కుతాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version