Healthy Cooking Oil: ఆరోగ్యానికి ఏ నూనెలు వాడితే మంచిదో తెలుసా?

వేరుశనగ నూనె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. ఇందులో విటమిన్ ఇ ఎక్కువ ఉండటంతో డయాబెటిక్ పేషెంట్లకు షుగర్ నియంత్రించేందుకు సాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతున్నారు. అవకాడో ఆయిల్ కూడా ఉంటుంది. ఇది తేలికపాటి రుచిని అందిస్తుంది. వేపుళ్లు, గ్రిల్ కసం దీన్ని వాడుకోవడం జరుగుతుంది. ఇందులో మనకు పనికివచ్చే కొవ్వు ఉంటుంది. విటమిన్ ఇ దొరుకుతుంది.

Written By: Srinivas, Updated On : May 29, 2023 3:57 pm

Healthy Cooking Oil

Follow us on

Healthy Cooking Oil: ఆరోగ్యకరమైన వంట నూనెలు వాడితేనే మనకు మేలు కలుగుతుంది. ఏవేవో పిచ్చి నూనెలు వాడితే ఆరోగ్యం ఖరాబు కావడం మామూలే. ఈ నేపథ్యంలో నూనెల రకాలపై మనం ఓ లుక్కేద్దాం. మార్కెట్లో వేరుశనగ, నువ్వుల, పొద్దుతిరుగుడు, కొబ్బరి వంటి నూనెలు పుష్కలంగా దొరుకుతాయి. నూనెల్లో చాలా రకాలుంటాయి. రీఫైన్డ్ ఆయిల్స్ అని రకరకాల పేర్లు పెట్టి అమ్ముతున్నారు. కొనేవాడే వెర్రివాడైతే అమ్మేవాడు ఏదైనా అమ్ముతాడు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మనం తింటున్నాం. దీంతో మన ఆరోగ్యం కూడా దెబ్బ తినే ప్రమాదముంటోంది.

వేరుశనగ నూనె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. ఇందులో విటమిన్ ఇ ఎక్కువ ఉండటంతో డయాబెటిక్ పేషెంట్లకు షుగర్ నియంత్రించేందుకు సాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతున్నారు. అవకాడో ఆయిల్ కూడా ఉంటుంది. ఇది తేలికపాటి రుచిని అందిస్తుంది. వేపుళ్లు, గ్రిల్ కసం దీన్ని వాడుకోవడం జరుగుతుంది. ఇందులో మనకు పనికివచ్చే కొవ్వు ఉంటుంది. విటమిన్ ఇ దొరుకుతుంది.

బరువు తగ్గాలనుకునే వారు పొద్దుతిరుగుడు నూనెను వాడుకోవడం మంచిది. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సాయపడుతుంది. ప్రై చేసుకువడంతో పాటు పులుసులకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కనోలా విత్తనాల నుంచి కనోలా నూనెను తీస్తారు. ఇందులో మంచి కొవ్వు ఉండటం వల్ల వంటలకు ఇది కూడా మేలు చేస్తుందని నమ్ముతున్నారు.

కేరళలో ఎక్కువగా కొబ్బరినూనె వాడతారు. అందుకు వారు తెలివిలో ముందుంటారు. కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి. పచ్చి కొబ్బరి తినడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయని చెబుతుంటారు. అందుకే కొబ్బరి నూనె కూరల్లో వాడుకుంటే మంచి ఫలితాలే వస్తాయి. కానీ మనం ఎక్కువగా వాడుకోం. వేరుశనగ నూనెలే వాడుతుంటాం. వంటలకు ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

నువ్వుల నూనెలో కూడా పోషకాలు బాగుంటాయి. లేత, ముదురు రంగులో ఇవి కనిపిస్తాయి. దీంతో ఫ్రై చేసుకుంటే మంచి వాసన వస్తుంది. నువ్వుల నూనె వంటలకు ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే వంటల్లో దీన్ని వాడుకుని మంచి బెనిఫిట్స్ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ద్రాక్ష గింజల నుంచి తీసే ఆయిల్ గ్రేప్ ఆయిల్. ఇది కూడా వంటలకు వాడతారు. కానీ మన ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా కనిపించదు. ఎవరికి తెలియదు. ఇది తేలికపాటి రుచి కలిగి ఉంటుంది. అన్నింటికంటే ఆలివ్ ఆయిల్ మంచిదంటారు. కానీ ఇది విరివిగా దొరకదు. దీంతో సలాడ్లు, మారినేటెడ్ కోసం ఎక్కువగా వాడతారు. దీన్ని కూరల్లో బాగా వాడుకుంటే మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.