Energy Foods
Energy Foods: మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏదో బద్ధకంగా ఉంటుంది. లేవాలంటేనే శక్తి చాలదు. దీంతో కొద్దిసేపు బెడ్ మీదే కూర్చుంటాం. ఎక్కువ సేపు నిద్రపోయినా ఎండాకాలంలో నిద్ర లేవడం కొంచెం కష్టమే. ఇలాంటి సమయంలో తక్షణ శక్తి కావాలనిపిస్తుంది. రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటానికి మనం కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది. మనకు శక్తిని పెంచే వాటిని తీసుకుంటేనే శ్రేయస్కరం.
అరటి పండు
అరటి పండులో ప్రొటీన్లు ఉంటాయి. ఫైబర్, విటమిన్ బి6, పొటాషియంతో పాటు పోషకాలు మెండుగా ఉంటాయి. దీంతో ఒంట్లో శక్తి పెరుగుతుంది. ఎక్కువ సమయం హుషారుగా ఉండేందుకు దీన్ని తినడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ పండు తినడం వల్ల శక్తి పెరిగి కండరాల పనితీరు బాగుంటుంది. అరటి పండు అల్పాహారంగా మాత్రం తీసుకుంటే నష్టమే.
పెరుగు
పెరుగులో కూడా మంచి ప్రొటీన్లు ఉంటాయి. పెరుగులోని ప్రొటీన్లు, కార్బోహైడ్రేడ్లు జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది. ఎక్కువ సమయం శక్తి ఉండేలా దోహదపడుతుంది. పెరుగులో పండ్లను వేసుకుని తింటే పోషకాలు బాగున్నందున దీన్ని తీసుకోవడం వల్ల ఎంతో లాభం కలుగుతుంది. పెరుగులో పండ్లు వేసుకుని తింటే ఇంకా శక్తి పెరుగుతుంది.
చియా విత్తనాలు
చియా విత్తనాల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. రోజు వీటిని తినడం వల్ల శక్తి పెరుగుతుంది. రోజంతా శక్తిగా ఉండేందుకు చియా విత్తనాలు తినడం మంచిదే. వీటిలో ప్రొటీన్లు, కొవ్వులు, ఫైబర్ తోపాటు తక్కువ కార్బోహైడ్రేడ్లు ఉన్నాయి. ఇందులో ఎన్నో రకాల ప్రొటీన్లు ఉండటంతో రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండటానికి ఆస్కారం ఉంటుంది.
ఓట్స్
ఓట్స్ కూడా మంచి ఆహారమే. షుగర్ పేషెంట్లకు ఇవి బాగా ఉపయోగపడతాయి. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. చక్కెరను అదుపులో ఉంచడంలో సాయపడతాయి. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉండటంతో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. దీంతో స్థిరమైన శక్తి దక్కుతుంది.
ఖర్జూరాలు
ఖర్జూరాలు మనకు మంచి శక్తిని ఇచ్చేవిగా ఉంటాయి. అందుకే రంజాన్ సమయంలో ముస్లింలు వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో కాల్షియం, భాస్వరం, పొటాషియం, మెగ్నిషియం, జింక్, ఇనుము లభించడంతో వీటిని తినడం వల్ల మనకు శక్తి ఇనుమడిస్తుంది. అందుకే వీటిని తినేందుకు మనం చొరవ తీసుకుంటే మంచిదే.