Miriyala Podi : పూర్వం రోజుల్లో అంటే.. 500 ఏళ్ల క్రితం ఇండియాలో కారం బదులు ఏమి వాడే వారో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. మరి ఏమి వాడేవారు ? అసలు కారం లేని కూరను మనం ఉహించుకోలేం. అలాంటిది అసలు కారం లేని కూరను ఎలా తినేవారు ? అసలు కారానికి బదులు ఏమి వాడేవారు అంటే.. ఆ రోజుల్లో ప్రతి వంటకంలో కారం బదులు మిరియాల పొడి వాడేవారు.
నిజానికి కారం ఎక్కువగా తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆల్ రెడీ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎండు మిర్చి కారం తినడం వలన అల్సర్, అరుగుదల లాంటి సమస్యలు వస్తాయని ఇప్పటికే వైద్యులు నిరూపించారు కూడా. మరి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఇప్పటికైనా కారానికి బదులు మిరియాల పొడిని వాడండి.
Also Read: 13 మంది బాలికలపై రేప్.. తల్లులను చేసేశాడు..
ఇంతకీ ఈ మిరియాల పొడి (Black Pepper) ఎలా ఉపయోగించ వచ్చో, ఉపయోగిస్తే ఎలాంటి లాభాలు చూద్దాం.
500 ఏళ్ల క్రితం ఇండియాలో రోగాలు పెద్దగా ఉండేవి కావు. కారణం కారం లేకపోవడమే. కారం బదులుగా మిరియాల పొడి వాడితే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని ఇప్పటికైనా తెలుసుకోండి.
మీకు తెలుసా? మిరియాల వలన దగ్గు తగ్గుతుంది, అలాగే ఎర్రకారం, ఎండు మిరపకాయలకి ప్రత్యామ్నాయంగా మిరియాల పొడిని వాడితే.. వంటలలో రుచి కూడా బాగా పెరుగుతుంది. పైగా శరీరానికి కూడా ఆరోగ్యం.
ఇక మిరియాలు వాడటం వల్ల మరి కొన్ని లాభాలు ఉన్నాయి :
ఎలర్జీలు తగ్గుతాయి. శ్లేష్మాల ఉత్పత్తి తగ్గిస్తుంది. ప్రేగుల్లో రక్షణ వ్యవస్థని పెంచుతుంది.
అదే విధంగా మతిమరుపు, అల్జీమర్స్ లాంటి మెదడుకు సంబంధించిన సమస్యలను నివారిస్తోంది.
ఇక షుగర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. స్మోకింగ్ వల్ల వచ్చే కెమికల్స్, పొల్యూషన్ ను లివర్ డీటాక్సిఫికేషన్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. రక్షణ వ్యవస్థకు సంబంధించిన కణజాలాన్ని యాక్టివ్ చేస్తుంది. క్యాన్సర్ కణాలను తొలగించడానికి దోహద పడుతుంది.
Also Read: 14 పెళ్లిళ్లు చేసుకున్న ప్రబుద్ధుడు.. ఏం చేశాడంటే?