https://oktelugu.com/

Prevent Heart Disease : గుండె జబ్బులు రాకుండా ఏం తినాలో తెలుసా?

Prevent Heart Disease : ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బులు భయపెడుతున్నాయి. డెబ్బయి ఏళ్లు దాటిన వాళ్లకు వచ్చే హార్ట్ ఎటాక్స్ ఇప్పుడు పాతికేళ్లకే వస్తున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. మనం తీసుకునే ఆహారమే మనకు ముప్పు తెస్తోంది. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అంతా బేకరీ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. ఫిజా బర్గర్లు తింటున్నారు. కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. దీంతో మన శరీరం గుళ్లబారుతుందని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా అందులో వాడే ఉప్పు, […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 31, 2023 / 09:46 AM IST
    Follow us on

    Prevent Heart Disease : ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బులు భయపెడుతున్నాయి. డెబ్బయి ఏళ్లు దాటిన వాళ్లకు వచ్చే హార్ట్ ఎటాక్స్ ఇప్పుడు పాతికేళ్లకే వస్తున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. మనం తీసుకునే ఆహారమే మనకు ముప్పు తెస్తోంది. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అంతా బేకరీ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. ఫిజా బర్గర్లు తింటున్నారు. కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. దీంతో మన శరీరం గుళ్లబారుతుందని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా అందులో వాడే ఉప్పు, నూనె, మైదా పదార్థాలు మన ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయి. మెల్లమెల్లగా రక్తనాళాల్లో పేరుకుపోతున్న కొవ్వుతో గుండె జబ్బులు వస్తున్నాయి. దీంతో ప్రాణాలే పోతున్నాయి.

    ఏం తినాలి?

    మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఏం తినాలి. మన ప్రకృతి వైద్య విధానంలో సహజంగా లభించే వాటిని ఎక్కువగా తీసుకుంటే మనకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు. వాటిని మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. మొలకెత్తిన విత్తనాల్లో ప్రొటీన్లు ఉంటాయి. ఉదయం అల్పాహారంగా వాటిని తీసుకుంటే ఇబ్బందులే ఉండవు. శనగలు, అలసందలు, పెసలు, బబ్బర్లు, ఉలవలు ఏవైనా రెండు రకాలు తీసుకుని వాటిని మొలకెత్తేలా చేసుకుని వాటిని తినడం వల్ల మనకు గుండె జబ్బుల ముప్పు రానే రాదు.

    మధ్యాహ్న సమయంలో..

    మధ్యాహ్న సమయంలో రెండు పుల్కాలు తింటే సరి. ఇందులో కూర ఎక్కువగా పెట్టుకుని నూనె వాడకుండా పుల్కాలు చేసుకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి తిప్పలు రాకుండా ఉంటాయి. వయసు పైబడుతున్న వారు ఈ డైట్ ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. విచ్చలవిడిగా తింటే ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. సహజసిద్ధమైనవి తింటే హృద్రోగ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

    రాత్రి సమయంలో..

    రాత్రి సమయంలో ఉడకబెట్టిన ఆహారాలను దూరంగా పెట్టాలి. వాల్ నట్స్, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వంటివి నానబెట్టుకుని తింటే ఎంతో ప్రయోజనం. వాటితో పాటు ఏదైనా పండు తింటే సరిపోతుంది. రాత్రి భోజనం సాయంత్రం ఆరున్నర లోపు కానివ్వాలి. ఇలా చేయడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు రావు. గుండె జబ్బుల బాధ ఉండదు. హార్ట్ లో బ్లాక్స్ ఏర్పడవు. ఇలాంటి ఆహారాలు తీసుకుంటే మనకు జీవితంలో కూడా గుండె జబ్బుల బెడద ఉండదు. ఆరోగ్యంగా జీవించాలనుకునే వారు ఇవి పాటిస్తే సరి.