https://oktelugu.com/

Weight Loss : పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వు కరిగించుకోవడానికి ఏం చేయాలో తెలుసా?

Weight Loss : మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన శైలి, ఆహార పదార్థాల వినియోగంతో ప్రతి వారి పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోతోంది. ఫలితంగా సన్నగా ఉండాల్సిన వారు డ్రమ్ములా మారుతున్నారు. నలుగురిలో తిరగాలంటే నామోషీగా ఫీలవుతున్నారు. అధిక బరువుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవ్వును కరిగించుకోవడానికి ఏవేవో చిట్కాలు వాడుతున్నా ఫలితాలు కనిపించడం లేదు. ఆహార అలవాట్లు మార్చుకోకుండా కొవ్వు కరగాలంటే సాధ్యం కాదు. మొదలు మన అలవాట్లు మార్చుకుంటే […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 12, 2023 / 08:30 AM IST
    Follow us on

    Weight Loss : మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన శైలి, ఆహార పదార్థాల వినియోగంతో ప్రతి వారి పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోతోంది. ఫలితంగా సన్నగా ఉండాల్సిన వారు డ్రమ్ములా మారుతున్నారు. నలుగురిలో తిరగాలంటే నామోషీగా ఫీలవుతున్నారు. అధిక బరువుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవ్వును కరిగించుకోవడానికి ఏవేవో చిట్కాలు వాడుతున్నా ఫలితాలు కనిపించడం లేదు. ఆహార అలవాట్లు మార్చుకోకుండా కొవ్వు కరగాలంటే సాధ్యం కాదు. మొదలు మన అలవాట్లు మార్చుకుంటే బరువు తగ్గడం జరుగుతుంది.

    దీనికి ఓ మంచి చిట్కా ఉంది. ఇది పాటిస్తే పొట్టు చుట్టూ ఉండే కొవ్వు మాయమవడం ఖాయం. బరువు నియంత్రణలోకి వస్తుంది. దీంతో నాజూగ్గా కనిపించడం మన కల. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఒక గ్దాస్ లో నీళ్లు తీసుకుని అందులో టీ స్పూన్ మిరియాల పొడి, దాల్చిన చెక్క, పసుపు తీసుకుని కొద్దిసేపు మరిగించాలి. తరువాత ఆ మిశ్రమానికి అల్లం కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికి మూడు సార్లు తీసుకోవాలి. ఇలా రెండు నెలలు చేస్తే మన శరీరంలో కొవ్వు తగ్గిపోతుంది.

    ఇది తీసుకునే అరగంట ముందు తీసుకున్న తరువాత అరగంట ఏమి తినకూడదు. దీని వల్ల మనకు ఫలితం వస్తుంది. ఇది తీసుకునే రోజుల్లో జంక్ ఫుడ్స్ గాని తీపి పదార్థాలు కానీ తినకూడదు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మన పొట్టలో పేరుకుపోయిన కొవ్వు లేకుండా పోతుంది. దీని వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. ఇది వేడితో కూడినది కావడతో మనకు అధిక వేడి ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి మజ్జి, కొబ్బరినీళ్లు తాగుతుంటే వేడి తగ్గించుకోవచ్చు. దీంతో మన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.

    ప్రస్తుత పరిస్థితుల్లో అందరు బేకరీ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. ఇందులో ఎక్కువగా ఉప్పు, నూనె వాడటంతో అవి మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. అందుకే చిన్న వయసులోనే బొజ్జలు రావడం జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయట పడకపోతే మనకు ఇతర వ్యాధులు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఆహార పదార్థాలు తీసుకోకపోతే ముందు ముందు ముప్పు ఏర్పడటం గ్యారంటీ.