Periods Problem: ఈ రోజుల్లో చాలా మంది ఆడవారు ఎదుర్కొంటున్న సమస్య రుతుక్రమం సరిగా రాకపోవడం. దీనికి అనేక కారణాలున్నాయి. మనం సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక కారణమే. ఈ నేపథ్యంలో రుతుక్రమం సరిగా రావాలంటే ఏం చేయాలి? ఏం పరిహారాలు పాటించాలి? అనే విషయాలపై రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. రుతుక్రమం సరిగా రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వీటిని ఎలా పాటించాలి. రుతుక్రమం సరిగా ఎలా చేసుకోవాలనే దానిపై ఓ చిట్కా ఉంది. ఇది పాటిస్తే రుతుక్రమ సమస్య దూరమవుతుందని చెబుతున్నారు.
దీనికి ఆయుర్వేదంలో ఓ చక్కనైన చిట్కా ఉంది. దీంతో రుతుక్రమ సమస్య ఇక రాదు. కొంచెం బెల్లం తీసుకుని దాన్ని మెత్తగా నూరాలి. అందులోనే అరస్పూన్ వాము వేసి మెత్తగా చేయాలి. తరువాత జీలకర్ర వేసి కూడా మెత్తగా చేయాలి. ఇందులో అర స్పూన్ నెయ్యి కలపండి. ఈ మిశ్రమాన్ని రోజు తీసుకోవడం వల్ల ఆగిపోయిన పీరియడ్స్ కూడా సక్రమంగా వస్తుంది.
సులభంగా ఇంట్లోనే చేసుకునే పరిహారం. అందుకే జాగ్రత్తగా తయారు చేసుకుని వాడుకుంటే నెలసరి ఇబ్బందులు లేకుండా పోతాయి. ప్రస్తుతం చాలా మందికి నెలసరి సరిగా రాదు. దీంతో వారికి అండం ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేం. సరైన సమయంలో నెలసరి వస్తే వారికి అండం ఎప్పుడు విడుదలువుతుందో కచ్చితంగా అంచనా వేయగలం. కానీ సమయం ప్రకారం నెలసరి రాకపోతే ఇబ్బందులే.
సాధారణంగా 21-35 రోజుల మధ్య అండం విడుదల ఉంటుంది. ఆరోజుల్లో కలయిక జరిగితే మగవారిలో ఉండే శుక్రకణం, ఆడవారిలో విడుదలయ్యే అండం కలిస్తేనే గర్భం వస్తుంది. ఈ నేపథ్యంలో అండం సక్రమంగా విడుదలయ్యే రోజుల్లో కలవడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది. దీన్ని గుర్తించుకుని నెలసరి సక్రమంగా వచ్చేలా ఈ చిట్కా వాడుకుని సమస్య లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.