Goddess Lakshmi: ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఏం చేయాలో తెలుసా?

Goddess Lakshmi: మన సంప్రదాయంలో డబ్బు కోసం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటుంటాం. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే మనం కొన్ని చిట్కాలు పాటించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి మనం కొన్ని పద్ధతులు అనుసరిస్తే ఫలితం దక్కుతుంది. మన ఇంట్లో ధనవృద్ధి కోసం ఎన్నో ప్రయాసలు పడుతుంటారు. డబ్బు నిలువ ఉండక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో మన ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి ఇంట్లోనే ఎన్నో పరిహారాలు చేస్తుంటారు. లక్ష్మీ […]

Written By: Srinivas, Updated On : March 25, 2023 2:08 pm
Follow us on

Goddess Lakshmi

Goddess Lakshmi: మన సంప్రదాయంలో డబ్బు కోసం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటుంటాం. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే మనం కొన్ని చిట్కాలు పాటించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి మనం కొన్ని పద్ధతులు అనుసరిస్తే ఫలితం దక్కుతుంది. మన ఇంట్లో ధనవృద్ధి కోసం ఎన్నో ప్రయాసలు పడుతుంటారు. డబ్బు నిలువ ఉండక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో మన ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి ఇంట్లోనే ఎన్నో పరిహారాలు చేస్తుంటారు. లక్ష్మీ కటాక్షం కోసం నానా తంటాలు పడుతుంటారు.

ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. శుక్రవారం రాత్రి గిన్నెలో కొద్దిగా అన్నం ఉంచి మూతపెట్టి ఉంచాలి. శనివారం ఉదయం ఆ అన్నం జంతువులకు గానీ పక్షులకు గానీ ఆహారంగా వేయాలి. దీంతో మనకు పితృదేవతలు అదృశ్య రూపంలో ఇంట్లోకి వస్తారని నమ్ముతారు. వారు ఇంట్లోకి వచ్చినప్పుడు అన్నం కనిపించాలి. అలా కనిపిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం వస్తుంది. అందుకే రాత్రి సమయంలో ఇల్లు శుభ్రం చేసుకున్నాక అన్నం ఉంచడం మరిచిపోవద్దు.

ఈ పరిహారం రోజు చేయడం కుదరకపోయినా కనీసం శుక్రవారం చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలిగి మనకు మంచి జరుగుతుంది. వంట గదిలో బొద్దింకలు తిరిగితే అరిష్టం. దీంతో దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందట. బొద్దింక తిరిగితే జేష్ట దేవి ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తుందట. పాత్రల మీద ఎప్పుడు మూతలు పెట్టి ఉంచాలి. మూతలు పెట్టకపోతే కూడా మనకు నష్టాలే కలుగుతాయి. వంట చేశాక పాత్రల మీద మూతలు పెట్టి ఉంచాలి. లేదంటే లక్ష్మీ దేవి కటాక్షం మనకు దక్కదు.

Goddess Lakshmi

ఇంట్లో ఆడవారు కాళ్లు ఊపకూడదు. మగాళ్లు మంగళవారం గడ్డం తీసుకోకూడదు. ఇంటి యజమాని అయినా ఇతరులైనా గడ్డం తీసుకోవడం సురక్షితం కాదు. ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు మూడు కళ్లు ఉన్న చిప్ప మనం తీసుకోవాలి. సమానంగా ఉన్నది వారికి ఇవ్వాలి. అలా చేస్తేనే మనకు శుభం కలుగుతుంది. కొబ్బరికాయ తాంబూలంలో పెట్టి ఎదుటి వారికి ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కళ్లు ఉన్నది మనం ఉంచుకుని వేరే చిప్ప వారికి ఇవ్వాలి. ఇలా చేస్తేనే లక్ష్మీ కటాక్షం దక్కుతుంది.