Dark Chocolate
Dark Chocolate: ప్రస్తుత రోజుల్లో శృంగారంలో ఇబ్బందులు వస్తున్నాయి. మనదేశంలో శృంగారం గురించి మాట్లాడినా తప్పుగానే అనుకుంటారు. అందుకే లైంగిక పరమైన ఇబ్బందులు వస్తున్నా ఎవరికి చెప్పుకోలేరు. మనం తీసుకునే ఆహారమే మనకు ప్రతిబంధకంగా మారుతోంది. దీని వల్ల శృంగారంలో చాలా సమస్యలు వస్తున్నాయి. పురుషులే కాకుండా స్త్రీలలో కూడా ఇలాంటి సమస్యలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం కొన్ని ఆహారాలు తీసుకుంటేనే మేలు కలుగుతుంది.
చేపలు
మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి చేపలు. మాంసాహారం తింటే మనకు బలం చేకూరుతుంది. చేపల్లో ఉండే ఒమేగా ఫ్యాట్ 3 వల్ల గుండె జబ్బుల ముప్పు రాకుండా పోతోంది. సాల్మన్ చేపలు వారానికి రెండు సార్లు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం నుంచి బయట పడొచ్చు. ఇలా చేపలు మనకు ఎన్నో విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.
ఆకుకూరలు
ఆకుకూరల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తాయి. గుండెకు మేలు చేయడంలో ఆకుకూరలు దోహదం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఆకుకూరలు తినడం వల్ల మనకు ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. శాఖాహారాల్లో ఆకుకూరలు నెంబర్ వన్ గా చెప్పుకోవచ్చు.
డ్రై ప్రూట్స్
డ్రై ఫ్రూట్స్ తింటే కూడా మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ఉండే ఫైబర్, ప్రొటీన్లు ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. డ్రైఫ్రూట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. దీంతో వాటిలో వాల్ నట్స్, బాదం, ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు ఉంటాయి. వీటిని తీసుకుంటే మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా లాభాలు కలుగుతాయి.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ తింటే మన వీర్య కణాల సంఖ్య పెరుగుతాయి. దీంతో సంతాన భాగ్యం కలుగుతుంది. పురుషుల్లో లైంగిక ఉద్దీపనలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. రక్తపోటును కంట్రోల్ చేయడానికి కారణమవుతుంది. గుండె జబ్బుల ముప్పును దూరం చేస్తుంది. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల మనకు శృంగార పరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి.