Clay Pot : మట్టికుండను ఈ దిక్కున పెడితే ఏం జరుగుతుందో తెలుసా?

Clay Pot : మట్టికుండ నీళ్లు మహాప్రసాదం అని పెద్దలు అంటారు. అందుకే పురాతన కాలంలో మట్టి పాత్రల్లో వండుకున్న భోజనం తిని వారు ఎంతో కాలంగా ఆరోగ్యంగా జీవించారు. ఆ విషయం తెలిసిన ఇప్పటి వారు మట్టికుండలో వండిన ఆహారాన్ని తినేందుకు డబ్బలు ఖర్చుపెడుతున్నారు. వేసవిలో నాచురల్ గా ప్రతి పాత్ర వేడిగా ఉంటుంది. కానీ మట్టి కుండ మాత్రమే చల్లదనాన్ని ఇస్తుంది. అందువల్ల ఎండాకాలంలో మట్టికుండ నీళ్లు తాగాలని అంటారు. మట్టికుండలో నీళ్లు తాగడం […]

Written By: Chai Muchhata, Updated On : April 7, 2023 5:41 pm
Follow us on

Clay Pot : మట్టికుండ నీళ్లు మహాప్రసాదం అని పెద్దలు అంటారు. అందుకే పురాతన కాలంలో మట్టి పాత్రల్లో వండుకున్న భోజనం తిని వారు ఎంతో కాలంగా ఆరోగ్యంగా జీవించారు. ఆ విషయం తెలిసిన ఇప్పటి వారు మట్టికుండలో వండిన ఆహారాన్ని తినేందుకు డబ్బలు ఖర్చుపెడుతున్నారు. వేసవిలో నాచురల్ గా ప్రతి పాత్ర వేడిగా ఉంటుంది. కానీ మట్టి కుండ మాత్రమే చల్లదనాన్ని ఇస్తుంది. అందువల్ల ఎండాకాలంలో మట్టికుండ నీళ్లు తాగాలని అంటారు.

మట్టికుండలో నీళ్లు తాగడం వల్ల దాహం తీరడమే కాదు.. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేటి కాలంలో మట్టికుండలనే రకరకాల పదార్థాలు వండి ఇస్తున్నారు. మట్టికుండ ఆవశ్యకత తెలుసుకున్నవారు దానిని విడిచిపెట్టరు. అయితే ఇంట్లో మట్టికుండను ఎక్కడపడితే అక్కడ పెట్టడం వల్ల ఇల్లుకే అరిష్టం అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ కుండను ఒక నిర్ణీత ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంటికి శుభాలు కలుగుతాయని అంటున్నారు. మరి ఆ విషయమేంటో తెలుసుకుందామా..

ప్రస్తతం అంతా ప్లాస్టిక్ మయంగా మారింది. ఎక్కడా మట్టి పాత్రలు కనిపించడం లేదు. కానీ గ్రామాల్లో, పట్టణాల్లో మాత్రం మట్టి పాత్రలను ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. పండుగల్లో, ప్రత్యేక రోజుల్లో మట్టి పాత్రలను వినియోగిస్తున్నా.. ఆ తరువాత వాటిని వాడడం లేదు. కానీ మట్టిపాత్రల విలువ తెలిస్తే మాత్రం ఎవరూ విడిచిపెట్టరు. మట్టిపాత్రల్లోని నీటిని తాగడం వల్ల శరీరం అలసట లేకుండా ఉంటుందట. ప్రకృతిలోని మలినాలను పీల్చుకునే శక్తి మట్టిపాత్రకు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇందులో నీరు పోయడం వల్ల అందులోని మలినాలను మట్టిపాత్ర తీసేసుకుంటుంది.

ఎండాకాలంలో బయట తిరిగి ఇంటికి వచ్చిన తరువాత మట్టిపాత్రలోని నీళ్లు మోహం కడుక్కుంటే ఎంతో ఆహ్లదంగా ఉంటుంది. అంతేకాకుండా మోహంపై ఉన్న క్రిములు దూరమవుతాయి. ఆ తరువాత మట్టి కుండలోని నీరు తాగడం వల్ల వడదెబ్బ నుంచి కూడా రక్షించుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచే లోహాలు మట్టిపాత్రలో ఉండడం వల్ల ఈ కుండలోని నీరు తాగితే అద్భుత ఫలితాలు ఇస్తాయి. ఇవే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులైన దగ్గు, అస్తమాతో పాటు ఇతర శ్వాస కోశ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.

అయితే మట్టి పాత్రను ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. మనం ఇంట్లోకి మట్టి కుండను తెచ్చిన తరువాత ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత ఈ కుండను ఉత్తర దిక్కున ఉంచాలంటున్నారు. ఉత్తర దిక్కును వరుణ దేవుడిదిగా భావిస్తారు. అందువల్ల మట్టికుండను అటువైపున ఉంచడం వల్ల వరుణ దేవుడిని పూజించే విధంగా కుండలో నీళ్లు ఉంచామని అంటారు. ఇలా కాకుండా ఇతర దిక్కుల్లో కుండ ఉంచడం వల్ల అరిష్టం అని అంటున్నారు. ఇక కుండను గాలి వచ్చే చోట ఉంచడం వల్ల చల్లగా మారుతుంది. అప్పుడు ఫ్రిజ్ కూడా అవసరం లేకుండా ఉంటుంది.