Papaya: బొప్పాయితో ఏ ఆహారాలు తీసుకోకూడదో తెలుసా?

పచ్చిబొప్పాయి తినడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు తిమ్మిరి రాదు. బొప్పాయితో దోసకాయ తినడం వల్ల కడుపు ఉబ్బరం, అపానవాయువు, కడుపు తిమ్మిరి, విరేచనాలు అయ్యే అవకాశం ఏర్పడుతుంది. దోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీంతో దోసకాయతో బొప్పాయిని తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.

Written By: Srinivas, Updated On : June 7, 2023 9:43 am

Papaya

Follow us on

Papaya: బొప్పాయి పండులో ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీన్ని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉండటంతో అల్పాహారంలో బొప్పాయిని తీసుకోవడం వల్ల మంచి లాభాలున్నాయి. రక్తం పెరిగేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నోటిపూత, పెదాల పగుళ్లకు మందులా పనిచేస్తుంది. బొప్పాయిని కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల నష్టాలు వస్తాయి.

దోసకాయతో..

పచ్చిబొప్పాయి తినడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు తిమ్మిరి రాదు. బొప్పాయితో దోసకాయ తినడం వల్ల కడుపు ఉబ్బరం, అపానవాయువు, కడుపు తిమ్మిరి, విరేచనాలు అయ్యే అవకాశం ఏర్పడుతుంది. దోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీంతో దోసకాయతో బొప్పాయిని తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.

ద్రాక్ష

బొప్పాయితో కలిపి ద్రాక్ష తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటి సమస్య వెంటాడుతుంది. ఇందులో ఉండే ఆమ్ల స్వభావం వల్ల బొప్పాయితో కలిపి తీసుకుంటే చికాగుతో జీర్ణ సంబంధమైన సమస్యలు పొడచూపే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ద్రాక్షను బొప్పాయితో తీసుకోవద్దు. ఇలా ద్రాక్ష పండ్లను బొప్పాయితో కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు.

టమాటాలు

బొప్పాయితో టమాటాలను కలిపి తీసుకోవద్దు. ఇలా చేస్తే జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి. టమాటాల్లో ఉండే ఆమ్ల స్వభావం కారణంగా యాసిడ్ రిఫ్లెక్స్, గుండె దగ్గర మంటకు కారణంగా నిలుస్తుంది. మసాలాలు కూడా బొప్పాయితో తీసుకుంటే నష్టాలే వస్తాయి. బొప్పాయితో మసాలాలు తీసుకోవడం వల్ల తిమ్మిర్లు, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలొస్తాయి.