
Health Tips: మనలో చాలా మంది ఆహార నియమాలు పాటించరు. ఏది పడితే అది తింటూ ఉంటారు. ఉదయం లేచింది మొదలు ఏదో ఒకటి పొట్టలో వేస్తూనే ఉంటారు. దీంతో కలిగే ఉపద్రవాల గురించి మాత్రం పట్టించుకోరు. కడుపు కీకారణ్యంగా మారితే ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య పరిరక్షణలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉన్నా నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. దీంతో జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. అనారోగ్యాలను కొనితెచ్చుకునే వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సులభంగా జీర్ణమయ్యేవే..
ఉదయం పరగడుపున మనం త్వరగా జీర్ణమయ్యే ఆహారాలనే తీసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. పొద్దున పుల్లటి పండ్లు తీసుకోవడం సురక్షితం కాదు. పల్లని పండ్లు తీసుకుంటే మనకు అనారోగ్యం కలగడం సహజం. అందుకే వాటి జోలికి వెళ్లకూడదు. పుల్లని పండ్లలో యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎసిడిటి సమస్య వస్తుంది. దీని వల్ల కడుపులో అల్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీని వల్ల పుల్లటి పండ్లు తీసుకోవడం సురక్షితం కాదు.
పచ్చి కూరగాయలు
పరగడుపున పచ్చి కూరగాయలు తినడం కూడా మంచిది కాదు. కానీ కొంత మంది మాత్రం పచ్చికూరగాయలను ఉదయం సమయంలో తింటుంటారు. ఇలా తినడం వల్ల పొత్తి కడుపులో నొప్పి వస్తుందని చెబుతుంటారు. ఇందులో ఫైబర్, అమైనో యాసిడ్లు ఎక్కువగా ఉండటంతో త్వరగా జీర్ణం కాదు. అజీర్తి సమస్యలు వస్తాయి. పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. ఇంకా పరగడుపున చాక్లెట్లు, క్యాండిల్ వంటివి కూడా తినకూడదు. దీంతో అందులో ఉండే చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది.

కాఫీ, టీలను కూడా..
ఉదయం పరగడుపున కాఫీ, టీలకు కూడా దూరంగా ఉండాలి. ఇందులో ఉండే కెఫిన్ పదార్థం మనకు జీర్ణం కాకుండా చేస్తాయి. అందుకే ఉదయం పూట కాఫీ, టీలు తాగడం సురక్షితం కాదు. కాఫీ, టీలు తాగితే మనకు ఒక శాతం ప్రొటీన్లు కూడా దక్కవు. కానీ మనం వాటికి ఆకర్షితులమైపోయాం. ఆంగ్లేయులు చేసిన అలవాటును ఇప్పటికి కూడా మానలేకపోతున్నాం. కొందరికైతే అవి తాగనిదే కాలకృత్యాలు కూడా తీర్చుకోవడం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు.
కారంతో ఇబ్బందే..
ఉదయం పరగడుపున తీసుకునే ఆహారాల్లో కారం ఉండటం కూడా ఇబ్బందులు కలిగిస్తుంది. ఉదయం పూటనే కారంగా తింటే కడుపులో ఆహారం త్వరగా జీర్ణం కాదు. పరగడుపున పెరుగు తినడం కూడా మంచిది కాదు. కడుపు ఉబ్బరంగా మారుతుంది. అరటి పండు తింటే కూడా అందులో ఉండే మెగ్నిషియం రక్తంపై ప్రభావం చూపుతుంది. కూల్ డ్రింక్స్ కూడా తీసుకోవద్దు. సోడాలు కూడా ఒంటికి మంచివి కావు. వీటి ద్వారా అల్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఉదయం సమయంలో మనం జాగ్రత్తగా ఆహారం తీసుకోకపోతే దాని వల్ల ఏర్పడే ఇబ్బందులే అధికం.