మన దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు మధుమేహంతో బాధ పడుతున్నారు. చాప కింద నీరులా వేగంగా మధుమేహం వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి నయం చేయలేని వ్యాధి కావడంతో పాటు ఎవరైతే ఈ వ్యాధి బారిన పడతారో వాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంటుంది. మధుమేహం బారిన పడిన వాళ్లు కళ్లు, మూత్రపిండాలు, కాలేయం, గుండె సంబంధిత సమస్యలతో బాధ పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే మధుమేహానికి సంబంధించిన కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. లక్షణాలు కనిపించిన సమయంలో డయాబెటిస్ ను గుర్తించడంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. మధుమేహం బారిన పడిన వాళ్లు పూర్తిస్థాయిలో ఆహార నియమాలను పాటించాలి. మధుమేహం రెండు రకాలు కాగా టైప్ 1 డయాబెటిస్ పిల్లలలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది.
పిల్లలకు ఇన్సులిన్ ఇంజెక్షన్లను ఇవ్వడం ద్వారా టైప్ 1 డయాబెటిస్ ను నియంత్రించే ఛాన్స్ ఉందని సమాచారం. టైప్ 2 డయాబెటిస్ వల్ల 90 శాతం మంది బాధ పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో జన్యుపరంగా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వ్యాయామం చేయడం, మందులు తీసుకోవడం, సమతులాహారం ద్వారా ఈ సమస్యలు దూరమవుతాయి.
తీపి పదార్థాలు, అన్నం, బ్రెడ్, మైదా పిండితో చేసిన పదార్థాలు, నూడుల్స్, బంగాళదుంపలతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేయడంతో పాటు కనీసం అరగంట పాటు నడవాలి. సన్ ఫ్లవర్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ ను వంటనూనెగా వాడాలి. జామ, ఉసిరి, నిమ్మ, జాము, నారింజ, బొప్పాయి పండ్లు, రవ్వ పిండి, వెల్లుల్లి, దాల్చిన చెక్క, గ్రీన్ టీ, సాధారణ మజ్జిగ, టోన్డ్ మిల్క్ ను ఆహారంలో చేర్చుకుంటే మంచిదని చెప్పవచ్చు.