Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ఆనాడే ఎన్నో విషయాలు చెప్పాడు. తన నీతిశాస్త్రం ద్వారా మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలను విశదీకరించాడు. మన ఇంట్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో? ఎలాంటి విషయాలు పట్టించుకుని ప్రవర్తన మార్చుకోవాలో సూచించాడు. మన ఇల్లు బాగుండాలంటే మనం మంచిగా జీవించాలంటే ఆచార్య చాణక్యుడు ఎన్నో రకాలుగా మనకు అర్థం చెప్పాడు. జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచి మార్గంలో నడుస్తామో కూడా వివరించాడు. అప్పటి ఆయన నీతి సూత్రాలే నేటికి మనకు మార్గదర్శకాలు అవుతున్నాయనడంలో సందేహం లేదు.
ఆచార్య చాణక్యుడి ప్రకారం మన ఇంట్లో ఉండే తులసి చెట్టు ఎప్పుడు పచ్చదనంతో ఉండాలి. అలాగైతేనే మనకు శుభాలు కలుగుతాయి. ఒకవేళ తులసి చెట్టు ఎండిపోవడం మొదలైందంటే మనకు కష్టాలు ప్రారంభమైనట్లే అని సూచించాడు. ఇంటి ముందర ఉండే తులసిని సురక్షితంగా కాపాడుకోవాలి. దాన్ని ఎండిపోకుండా జాగ్రత్తలు వహించాలి. తులసి చెట్టు ఎండిపోతుందని మనకు కనిపిస్తే ఆర్థికంగా నష్టాలు వస్తున్నట్లే అని గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం ఆనాడే ఆచార్యుడు చెప్పడం గమనార్హం.
ఇక ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలు జరుగుతాయో ఆ ఇంట్లో కూడా డబ్బు నిలవదు. లక్ష్మీదేవి నివాసం ఉండదు. చీటికి మాటికి నిత్యం ఏదో ఒక విషయంలో కొందరు గొడవలకు దిగుతుంటారు. ఇది అరిష్టమే. అనర్థదాయకమే అని గుర్తుంచుకోవాలి. ప్రశాంతంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుందట. కయ్యాలు పుట్టించే వారి ఇంట అసలు కాలు మోపదట. దీంతో మనం గొడవలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. లక్ష్మీదేవి ఉండకుండా చేసుకోవడం మన స్వయంకృతాపరాధమే. అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిదే.
ఇంకా పరిశుభ్రత లేని ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. మనం ఉండే ఇంట్లో నిత్యం పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు పూజలు కూడా చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట కాలు మోపుతుంది. మన దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. ఆచార్య చాణక్యుడు ఆనాడే చెప్పిన విషయాలు నేటికి మనకు కళ్లకు కడుతూనే ఉన్నాయి. మన కిటికీలకు గీతలు పడితే వాటిని ఉంచకుండా తీసివేయాలి. పగిలిన వాటిని ఉంచుకోవడం కూడా అరిష్టమే. మన ఇంట్లో డబ్బు నిలవాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందేనని చాణక్యుడు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.