Clay Pot: మనం ఎండాకాలంలో చల్లగా ఉండే వాటిని కోరుకుంటాం. చలికాలంలో వెచ్చగా ఉండాలని ఆశిస్తాం. ఇందులో తప్పు లేదు. ఆ కాలాలకు అనుగుణంగా మనకు ఇష్టమైనవి. ఎండలో చల్లదనం, చలిలో వెచ్చదనం అందరు కోరుకుంటారు. కానీ అవి అలా ఉండటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. నీళ్లు తాగడానికి మనం మట్టి కుండ వాడుతాం. అందులో నీరు ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. ఆ నీళ్లు తాగితే మనకు ఆరోగ్యం బాగుంటుంది. అందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీంతో మనం మట్టికుండలోని నీళ్లు తాగడానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇందులో నీరు ఎందుకు చల్లగా ఉంటుంది
మట్టి కుండలో నీరు ఎండాకాలంలో చల్లగా ఎందుకుంటుంది. అనే అనుమానాలు అందరిలో రావడం సాధారణమే. అది దాని సహజత్వమే అయినా అందులో కొన్ని కారణాలు కూడా దాగి ఉన్నాయి. మట్టి కుండ గోడలలో అనేక సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. రంధ్రాల నుంచి బయటకు వచ్చే నీరు ట్రాన్స్ఫిరేషన్ ప్రక్రియలో భాగంగా భాష్పీభవనం చెందుతుంది. అంటే ఆవిరి రూపంలో మారుతుంది. దాన్ని శీతలీకరణ ప్రక్రియ అంటారు. ఇలా ట్రాన్స్ఫిఫరేషన్ జరిగే ఉపరితలం చల్లగా మారడానికి కారణమవుతుంది. ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోవడానికి సహకరిస్తుంది. దీంతో నీరు చల్లగా మారుతుంది.
సింధూలోయ నాగరికత నుంచి..
మట్టి కుండల వినియోగం ఇప్పటిది కాదు. సింధులోయ నాగరికతలో కూడా మట్టికుండలు వాడారు. అందుకే మన పూర్వీకులు అంత ఆరోగ్యంగా జీవించారు. వారు అన్నింటికి మట్టి పాత్రలే. స్టీల్ వినియోగం లేదు. వారి ఆరోగ్యానికి కారణం మట్టిపాత్రలే కావడం గమనార్హం. మనం నాగరికత పేరుతో మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం. ఎండాకాలం వచ్చిందంటే కొత్త కుండలో నీళ్లు తాగితే ఆ మజాయే వేరు. ఆ రుచిలో కూడా తేడా ఉంటుంది. అదే మట్టి కుండ ప్రత్యేకత. తెలిసిన వారు అందరు మట్టి పాత్రలను వాడతారు.
ఫ్రిజ్ లో ఏముంది?
ఫ్రిజ్ ఆధునిక నాగకరితకు చిహ్నం. ఫ్రిజ్ వాడటం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. అందులో సూక్ష్మక్రిములు పుష్కలంగా ఉంటాయి. అందులో పెట్టిన కూరగాయలు, పాలు, పెరుగు పాడుకాకుండా ఉంటాయేమోకాని వాటిని తినడం కూడా సురక్షితం కాదు. సహజంగా మనకు లభించే వాటినే తినాలి. అంతేకాని నిలువ చేసుకుని తినడం సరైంది కాదు. అందుకే ఫ్రిజ్ వాడకం అవసరం లేదు. కాని ఎవరు వింటారు. ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉండాల్సిందే. మట్టి పాత్రలను వాడండి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి. వీలైతే మట్టిపాత్రల్లోనే అన్నం తినడం ఇంకా మంచిది.