Sleeping Problems: ఏ ప్రాణికైనా సరైన తిండి, నిద్ర లేకపోతే ఇబ్బందే. అందుకే మన జీవితంలో ఎక్కువ భాగం నిద్ర కోసమే పోతోంది. ప్రతి మనిషి రోజుకు కనీసం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగైతేనే మన రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేసి మనకు వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న నిద్రను నిర్లక్ష్యం చేస్తే అంతేసంగతి. మరో విషయం ఏంటంటే రాత్రి పది గంటల నుంచి తెల్లవారు జాము నాలుగు గంటల మధ్య పోయే నిద్ర మనకు బాగా పనికొస్తుంది. అంతేకాని సమయం తప్పి నిద్ర పోతే కూడా ప్రయోజనం ఉండదు.
సరైన సమయానికి తిండి, నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఫలితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందే. రోజుకు ఎన్న గంటలు నిద్ర పోవాలో అన్ని గంటలే నిద్రకు సమయం కేటాయించుకోవాలి. అంతే కాని నిద్ర పోవడం వల్ల మంచి జరుగుతుందని అదేపనిగా పడుకుంటే కూడా అనారోగ్యమే. దానికి వేళపాలా ఉండాలి. కనీస సమయం పాటించాలి. అప్పుడే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఏదైనా అతి చేస్తే అంతే. ఈ విషయాలు మనకు తెలిసినవే కావడంతో నిద్ర విషయంలో జాగ్రత్తలు అవసరమే.
సరైన నిద్ర ఉంటే రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది. సీజనల్ వ్యాధులు చుట్టుముట్టవు. బరువు పెరిగే అవకాశం ఉండదు. జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య ఉండదు. ఇంకా ఎన్నో సమస్యలకు మూలం నిద్ర కావడంతో దాన్ని మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. సమయం ప్రకారం నిద్ర పోతేనే శరీరం రిపేర్ చేసుకుని అన్ని అవయవాలు బాగా పనిచేసేందుకు సాయపడుతుంది. కానీ నిద్రకు దూరమైతే మాత్రం అన్ని రోగాలు చుట్టుముట్టి మనకు అవస్థల పాలు చేస్తుంది.
నిద్రలేమితో ఎన్నో సమస్యలు మన దరి చేరడం ఖాయం. చర్మం త్వరగా ముడతలు పడుతుంది. వృద్ధుల్లా మారిపోతాం. ఇంకా దేహంలో ఏవేవో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే జీవితంలో రోజుకు ఎన్ని గంటలు పడుకోవాలో అన్ని గంటలు కచ్చితంగా నిద్రకు కేటాయించుకోవాల్సిందే. సుఖమైన తిండి, నిద్రతోనే మనిషి తన ఆయుష్షును పెంచుకుంటూ నూరేళ్లపాటు హాయిగా జీవించే అవకాశం ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకుని మసలుకుంటే జీవితం నందనవనమే. లేదంటే అనారోగ్యాలమయమే అని గుర్తుంచుకోవాలి.