Tamarind Water: మన దేశంలోని ప్రజలు వంటకాలలో ఎక్కువగా ఉపయోగించే వాటిలో చింతపండు ఒకటనే సంగతి తెలిసిందే. పప్పు, సాంబార్ లో చింతపండును వినియోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చింతపండు ద్వారా శరీరానికి అవసరమైన ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫైబర్ తో పాటు విటమిన్ ఎ, సి కూడా లభిస్తాయి. చింతపండు ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
చింతపండు నీళ్లు కామెర్ల సమస్యకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. కాలేయ కణాలను సరిగ్గా చేసే లక్షణాలు చింతపండులో ఉన్నాయి. చింతపండు నీళ్ల సహాయంతో పచ్చ కామెర్లను, గొంతు మంటను సులభంగా తగ్గించుకోవచ్చు. చింతపండు నీళ్లతో గార్గిల్స్ చేయడం ద్వారా టాన్సిల్స్ సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. చింతపండు నీళ్లతో గొంతు, చెంపల చుట్టూ నొప్పి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
Also Read: మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీ బీరువా ఇలా ఉండాల్సిందే!
చింతపండు నీళ్ల సహాయంతో రక్తహీనత సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. బరువు తగ్గించడంలో చింతపండు నీళ్లు సహాయపడతాయి. చింతపండులో ఉండే హైడ్రాక్సిల్ యాసిడ్ ఎంజైములను పెంచడంతో పాటు అదనపు కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. చింతపండు నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేస్తే మొటిమలు, దద్దుర్లు లాంటి సమస్యలు తగ్గుతాయి.
చింతపండు ఆకులు, పువ్వులు కూడా కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. చింతపండు పూలతో కూరగాయ చేసి తింటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. సైనస్ సమస్యతో బాధ పడుతున్న వాళ్లు చింతపండు సహాయంతో ఆ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
Also Read: చూపు మందగిస్తోందా.. భోజనం చేసిన తర్వాత చేయాల్సిన పనులివే?