https://oktelugu.com/

Winter Foods : శీతాకాలంలో వేడి పుట్టించే ఆహారాలేవో తెలుసా?

Winter Foods : చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీంతో శరీరం చల్లగా అవుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. వేడి తగ్గితే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. శీతాకాలంలో సహజంగానే చలి ఎక్కువగా ఉంటుంది. దీంతో చలి నుంచి రక్షణ కల్పించుకునేందుకు సరైన దుస్తులు ధరించాల్సిందే. ఉష్ణోగ్రతను పెంచుకునే క్రమంలో ఉన్ని దుస్తులను వేసుకుంటాం. చలి బారి నుంచి మన శరీరాన్ని కాపాడుకునేందుకు సరైన దుస్తులను ఆశ్రయించాల్సిందే. లేదంటే మనకు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 22, 2023 / 06:42 PM IST
    Follow us on

    Winter Foods : చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీంతో శరీరం చల్లగా అవుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. వేడి తగ్గితే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. శీతాకాలంలో సహజంగానే చలి ఎక్కువగా ఉంటుంది. దీంతో చలి నుంచి రక్షణ కల్పించుకునేందుకు సరైన దుస్తులు ధరించాల్సిందే. ఉష్ణోగ్రతను పెంచుకునే క్రమంలో ఉన్ని దుస్తులను వేసుకుంటాం. చలి బారి నుంచి మన శరీరాన్ని కాపాడుకునేందుకు సరైన దుస్తులను ఆశ్రయించాల్సిందే. లేదంటే మనకు ఉష్ణోగ్రతలు తగ్గి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

    ఈ కాలంలో ఎక్కువగా ఎండలో ఉండేందుకు చొరవ చూపాలి. సూర్యరశ్మి ఎంత తగిలితే మన శరీర ఉష్ణోగ్రత అంత పెరుగుతుంది. దీంతో మనకు వేడి తగులుతుంది. ఇంకా ఇంట్లోని కిటికీలు, తలుపులు తెరిచి ఉంచితే ఎండ ఇంట్లోకి ప్రవేశించి వేడి కలుగుతుంది. రాత్రి పూట మాత్రం కిటికీలు, తలుపులు మూసి ఉంచితే వేడి ఉంటుంది. రుచికరమైన ఆహారం తీసుకుంటే మనకు ఉపశమనం లభిస్తుంది. కారం ఉండే వాటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కారం అతిగా తింటే కూడా నష్టమే.

    శరీరానికి వేడి పుట్టించే ఆహారాలనే తీసుకోవాలి. పసుపు, తేనె, అల్లం, దాల్చిన చెక్క, గింజలు, గుడ్లు, మిరియాలు మన శరీరానికి వేడిని కలిగించే ఆహారాలుగా ఉంటాయి. అందుకే వాటిని తరచుగా తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోకుండా చేస్తాయి. రోజు వ్యాయామం చేస్తూ చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇందుకు సరైన పద్ధతులు పాటించాలి. వాకింగ్ చేయాలి. పరుగు పెడితే శరీరం ఇంకా వేడిగా మారుతుంది. ఆటలు ఆడితే కూడా ఎంతో లాభం కలుగుతుంది. ఇలా శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు ఇలాంటి చిట్కాలు పాటించడం శ్రేయస్కరం.

    చలికాలంలో శరీరం వేడిగా ఉంచుకోవడానికి ఒక కప్పు వేడి సూప్ తాగితే లోపలి నుంచి వేడి వస్తుంది. బయట నుంచి తెచ్చుకున్న సూప్ కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో మేలు. వేడిని రగిలించుకునేందుకు సూప్ తాగడం ఉత్తమం. కాళ్లకు సాక్స్ వేసుకుంటే కూడా మనకు చలి రాకుండా చేస్తాయి. పాదాలు వెచ్చగా ఉంటే శరీరం వేడిగా ఉంటుంది. నిద్రపోయే సమయంలో వేడి ఉంటే మంచి నిద్ర పడుతుంది. ఒంట్లో రక్తం తక్కువగా ఉంటే చలి వేస్తుంది. తగినంత ఎర్ర రక్త కణాలు ఉండవు.

    శరీరానికి సరైన వేడి రావాలంటే గుడ్లు, చేపలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇందులో ఇనుము, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో శరీరం వేడిగా ఉండటానికి దోహదపడతాయి. శీతాకాలంలో సరైన ఆహారం తీసుకుని కాపాడుకునేందుకు చొరవ తీసుకోవాలి. సీఫుడ్స్, చికెన్, ఆకుకూరలు, ఇనుము వంటివి మనకు దక్కాలంటే వీటిని కచ్చితంగా తిని మన దేహాన్ని చలి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.