Age Difference in Marriage: వివాహం గురించి అందరికి ఎన్నో ఊహలు ఉంటాయి. ఎన్నో ఆశలు పెనవేసుకుంటాయి. జీవితంలో పెళ్లి చేసుకుని మంచి జీవనం గడపాలని అందరు భావిస్తుంటారు. దీంతో వివాహంపై ఎవరి అంచనాలు వారికి ఉంటాయి. పూర్వం రోజుల్లో వివాహం చేసుకునే జంటలకు వయసు తేడా ఉండేది. నలభై ఏళ్ల వ్యక్తికి చిన్న పిల్లను ఇచ్చి పెళ్లి చేసేవారు. కానీ కాలక్రమంలో వయసు ప్రభావం చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం అబ్బాయి అమ్మాయి వయసులో వ్యత్యాసం ఉండకుండా చూసుకుంటున్నారు. నాలుగైదు ఏళ్ల తేడా ఉంటేనే పెళ్లికి సై అంటున్నారు. అంతేకాని పదుల సంఖ్యలో వయసు తక్కువగా ఉంటే పెళ్లికి ముందుకు రావడం లేదు.
ప్రస్తుతం జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అందరిలో వస్తోంది. దీంతో జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకునే ఆలోచనతో వయసు పెరుగుతోంది. దీంతో వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. వయసులో తేడా ఉంటే పెళ్లికి వధువు ముందుకు రావడం లేదు. వయోభారం ఎక్కువగా ఉంటే సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో సరైన వయసులో ఉన్న వారినే పెళ్లాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మందికి అమ్మాయి దొరకడం కష్టంగానే మారుతోంది.
Also Read: Parent-Child Relationship: పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులేంటో తెలుసా?
మారుతున్న కాలంలో సేమ్ వయసులో వారు పెళ్లి చేసుకునేందుకే ఇష్టపడుతున్నారు. ఉద్యోగం చేయడం పురుష లక్షణం కావడంతో అబ్బాయిలు జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో అమ్మాయిలు కూడా మంచి పొజిషన్ లో ఉన్న వారినే వివాహం చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. కాలగమనంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా ఉండాలంటే ఒకే వయసు వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం.
దీంతోనే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల కోసం వెంపర్లాడుతున్నారు. ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడి పెళ్లి చేసుకుని సంసారం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే వయసు వారు దొరకడం కొంచెం కష్టంగానే మారుతోంది. అందుకే అబ్బాయికి 30 ఉన్నా అమ్మాయికి 24 లేదా 25 ఉంటే సరిపోతుందని చూస్తున్నారు. ఇలాంటి వారి కోసమే నిరంతరం వెతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో వివాహం కాస్త ఆలస్యం అవుతూనే ఉంది. దీంతో అబ్బాయి వయసు కాస్త అటు ఇటు అవుతూనే ఉంది. కానీ అమ్మాయి మాత్రం తమకు జీవితంలో స్థిరపడిన వాడే భర్తగా రావాలని ఆశిస్తున్నారు.
ఈ క్రమంలో వివాహ వ్యవస్థ లో ఉన్న ఆచార సంప్రదాయాల ప్రకారం పెళ్లి తంతు జరపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పూర్వం రోజులకు ప్రస్తుత పరిస్థితులకు ఎంతో తేడా ఉంది. గతంలో సచిన్ టెండుల్కర్ కు ఆయన భార్యకు వయసులో ఐదు సంవత్సరాలు తేడా ఉందట. ఇక్కడ సచిన్ కంటే ఆయన భార్య వయసే ఎక్కువ ఉండటం గమనార్హం. దీంతో పెళ్లిళ్ల వ్యవస్థ ప్రస్తతం ట్రెండ్ మారింది. సరైన వయసులో ఉన్న వారే పెళ్లికి ఓకే చెబుతూ కొత్త తరహా సంప్రదాయానికి తెర తీస్తున్నారని తెలుస్తోంది.
Also Read:Presidential Elections- Jagan: రాష్ట్రపతి ఎన్నికలు.. జగన్ మద్దతు ఎవరికంటే?