Ginger Tea Health Problems: మనలో చాలా మంది టీలు తాగుతుంటారు. ఉదయం లేచిన వెంటనే టీ కానీ కాఫీ కానీ తాగనిదే ఉండరు. కచ్చితంగా టీ తాగాల్సిందే. అందులో అల్లం టీ అంటే ఇష్టంగా తాగుతారు. అందులో అల్లం వేసుకుని టీ తాగితే భలే మజాగా ఫీలవుతారు. అందుకే ఎక్కువ అల్లం టీ తాగి రిలాక్స్ అవుతారు. ఈ టీని వర్షాకాలం, చలికాలం తాగితే మంచిదే కానీ ఎండాకాలంలో దీన్ని ఎక్కువగా తాగడం వల్ల నష్టమే.
ఎక్కువగా తాగితే..
అల్లం టీని ఎక్కువ సార్లు తాగితే నష్టం కలుగుతుంది. అల్లంలోని గుణాలు రక్తస్రావం కలిగిస్తాయి. మిరియాలు, లవంగాలు లాంటి దినుసులు కూడా వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అల్లం తక్కువ పరిమాణంలో తీసుకుంటేనే మంచిది. అల్లం అధికంగా తీసుకుంటే జీర్ణక్రియ ఆటంకం కలుగుతుంది. ఉదర సంబంధమైన సమస్యలు వస్తాయి.
డయేరియా
అల్లం టీ తాగడం ద్వారా డయేరియా వచ్చే అవకాశాలున్నాయి. అల్లం వేసుకునే టీ తాగడం వల్ల రుచి వస్తుంది కానీ దీన్ని తాగడం ద్వారా గుండెలో మంట, కడుపునొప్పి వంటి ఇబ్బందులు వస్తాయి. అల్లం పరిమితంగానే వాడటం సురక్షితం. దీని కారణంగా అల్లంను బాగా వాడుకోవడం శ్రేయస్కరం కాదు. టీ తాగే అలవాటును తగ్గించుకుంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఇంకా నష్టాలేంటి?
అల్ల్లం టీ తాగితే ఇబ్బందులు వస్తాయి. టీ వల్ల మనకు ఒక శాతం కూడా ప్రొటీన్లు ఉండవు. ఏదో ఉపశమనం కోసమే తాగుతుంటారు. జిహ్వ చాపల్యం కోసమే టీ తాగుతుంటారు. కానీ అందులో బలం లేదని తెలిసినా పట్టించుకోరు. టీ తాగే అలవాటును ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. దానికి దూరంగా ఉంటేనే సురక్షితం అని గ్రహించుకోవాలి.