Betel Leaf: మన ఇంటికి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి. దీని కోసం ఇంటి ఆవరణను వాస్తు లోపాలు లేకుండా చేసుకోవడానికి ఇష్టపడుతుంటాం. దీని కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. వాస్తు దోషాలు లేకుండా చేసే మొక్కలు పెంచేందుకు మొగ్గు చూపుతాం. కొన్ని రకాల మొక్కలు పెంచుకుంటే మనకు కష్టాలు దూరం కావడం సహజమే. వాటిని పెంచుకునే క్రమంలో మనం ఎటు వైపు పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుని అలా పెంచుకోవడం మంచిది. చాలా మంది ఇంటి సింహద్వారానికి ఎదురుగానో, కిటికీల పక్కనో మొక్కలు పెంచుతుంటారు. ఇది కరెక్టు కాదు. పక్కా వాస్తు ప్రకారం చూసుకుని పెంచితేనే మనకు లాభాలు వస్తాయి.
అదృష్టాన్నిచ్చే మొక్కలు
మనకు అదృష్టాన్ని కలిగించే మొక్కల్లో తులసి, బిల్వం, ఉసిరి, జమ్మి, వేప, సరస్వతి, బ్రహ్మకమలం, రుద్రాక్ష, మరువం, దవనం, పున్నాగ, కదంబం, తమలపాకు వంటివి మనకు అదృష్టాన్ని ఇచ్చేవి. వీటిని మన ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. వీటిని నాటుకునే సమయంలో వాస్తు పద్ధతులు పాటించాలి. ఇంటికి ఆగ్నేయ దిశలో ప్రహరీకి కనీసం ఐదు అడుగుల దూరంలో నాటుకుంటే మంచిది. తులసి మొక్కను ఆగ్నేయ దిశలో కుండీలో పెంచాలి. నేలపై ఎప్పుడు కూడా తులసిని పెంచడం వల్ల నష్టాలే వస్తాయి.
తమలపాకు
తమలపాకును నాగవల్లి అంటారు. దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎంతో లాభం కలుగుతుంది. ఆయుర్వేదంలో కూడా దీన్ని ఔషధంగా వాడతారు. ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే కష్టాలు లేనట్లే. మన అదృష్టం బాగుంటుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బుకు లోటుండదు. ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా దూరం అవుతాయి. భూత ప్రేత పిశాచాలు కూడా మన ఇంట్లోకి రావు. తమలపాకు తీగ మన ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి కొలువున్నట్లే. లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉన్నట్లుగానే భావిస్తారు.
తమలపాకులతో ఏం చేస్తారు?
తమలపాకులు ఆంజనేయ స్వామికి ఇష్టమైనవి. దీంతో భక్తులు మంగళవారం, శనివారం హనుమాన్ కు తమలపాకుల మాల వేస్తుంటారు. ఆకుపై నువ్వుల నువ్వుల నూనె కలిపి శ్రీరామ అని రాసి ఆంజనేయుడి ఫొటో ముందు ఉంచి నమస్కరిస్తే దేవుడి అనుగ్రహం లభిస్తుంది. మరుసటి రోజు ఆ ఆకును పారే నీటిలో వేస్తే మంచి జరుగుతుంది. ఇలా తమలపాకుతో మనం ఎన్నో రకాల పూజలు చేయడం సహజమే. ఇలాంటి తమలపాకు చెట్టును ఇంటిలో పెంచుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని నమ్మి పెంచుకుంటే ఉత్తమం.