Benefits Of Smiling: నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారో సినీకవి. నవ్వుకున్న మహత్తర శక్తి అలాంటిది. నవ్వుతుంటే రోగాలు కూడా దరిచేరవు. అందుకే మనసారా నవ్వుకుంటే హాయిగా ఉంటుంది. రోజుకు కనీసం నాలుగైదు సార్లయినా నవ్వుకుంటే మనకు ఎలాంటి నష్టం ఉండదని తెలుసుకోవాలి. అందుకే హాస్య సంబంధమైన సినిమాలు, కథలు చూస్తే మనకు అనుకోకుండా నవ్వు వస్తుంది. దీంతో కడుపారా నవ్వుకుంటే ఎంతో ఆరోగ్యమని గుర్తించాలి. అందుకే నవ్వుకు ప్రాధాన్యమిచ్చి నవ్వుకునే జోకులు ఎప్పుడు వేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది.
నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆందోళనను రూపుమాపుతుంది. ఆయుష్షును పెంచుతుంది. ఇన్ని రకాలుగా ప్రయోజనం కలిగించే నవ్వుకు ఎందుకు వెనకాడతారు. మనసారా నవ్వుకోండి. ఆరోగ్యాన్ని తెచ్చుకోండి. నవ్వుతోనే నానా రకాల రోగాలు నాశనం అవుతాయట. అందుకే నవ్వును ఒక అలవాటుగా చేసుకోండి. పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు హాయిగా నవ్వేందుకే ప్రాధాన్యం ఇవ్వండి. నవ్వుతో నష్టాలుంటాయనేది పాత మాట. నవ్వుతోనే నాలుగు లాభాలున్నాయనేది ప్రస్తుత మాట.
Also Read: Target TRS: టార్గెట్ టీఆర్‌ఎస్.. ఆ నలుగురి ఓటమికి బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు!
పెద్దల మాట పెరుగన్నం మూట అన్నట్లు మన పూర్వీకులే హాస్యానికి పెద్ద పీట వేశారు. కథలు, డ్రామాల్లో ప్రత్యేకంగా నవ్వించడానికి ఓ జోకర్ (బుడ్డరకాన్) వేషం ఉండేది. దీంతో అతడు తన మాటలతో అందరిని నవ్వించేవాడు. అలా నాటకమైనా కథైనా హాస్యంతో నడిచేది. ప్రస్తుతం సినిమాల్లో కూడా హాస్య నటులకు కొదవే లేదు. హాస్యానికి మారుపేరే బ్రహ్మానందం. తన నటనతో అందరిని నవ్విస్తుంటాడు. ఇంకా చాలా మంది కమెడియన్లు పలు షోల ద్వారా నవ్విస్తున్నారు. ఈటీవీలో జబర్దస్త్ షో ద్వారా కూడా కమెడియన్లు కామెడీ చేస్తుంటారు. ఆ షోకు అత్యంత పాపులారిటీ వచ్చింది. ఎందుకంటే అది మొత్తం హాస్యంతో కూడుకున్నదే అయినందున.
నవ్వటంలో పిల్లలు ఎక్కువగా ఆనందపడతారట. రోజుకు వారు 400 సార్లు నవ్వుతూ మనసును హాయిగా ఉంచుకుంటారు. అందుకే వారికి ఎలాంటి కల్మషం లేని మనసు అంటారు. పెద్దలైతే కనీనం 40-50 సార్లు మాత్రమే నవ్వుతారట. దీంతో వీరికి పూర్వం రోజుల్లో వైద్యుడి దగ్గరకు వెళితే రోజుకు కనీనం 500 సార్లు నవ్వమని సలహా ఇచ్చేవారట. అంటే నవ్వుకు ఎంతటి ప్రాధాన్యం ఉందో ఇట్టే తెలిసిపోతోంది. నవ్వు నవ్వితే నవరత్నాలు రాలతాయని మన పూర్వీకులు నవ్వని వారిని చూసి అనేవారు.
మనసుంటే మార్గముంటుందన్నట్లు నవ్వాలనుకుంటే ఎలాగైనా నవ్వొచ్చు. అంతేకాని మూతి ముడుచుకుని కూర్చుంటే ఏం లాభం. హాయిగా నవ్వితే నవనాడులు నాట్యమాడతాయి. దీంతో మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తాయి. అందుకే కడుపుబ్బ నవ్వుకుంటే ఎలాంటి ఒత్తిడులు దరిచేరవని తెలిసిందే. నవ్వటానికి తగిన పరిస్థితులు మనం సృష్టించుకోవాలి. నవ్వు తెప్పించే పుస్తకాలు, కార్టూన్లు, షోలు తదితర వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ నవ్వుతుంటే ఎలాంటి టెన్షన్లు మన దరిచేరవు.
Also Read:YCP Plenary 2022: ఆ అనుమానం ప్లీనరీతో పటాపంచలైంది.. వైసీపీలో పెరిగిన దీమా