Taati Munjalu: ఈ వేసవి చాలా హాట్‌గా ఉంది. మార్చి నుంచే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సీయస్‌కుపైగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం 45 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. రాబోయే రోజులు మరింత హాట్‌గా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా మంది వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం తర్వాత బయటకు రావడం లేదు. ఇంట్లోనే చల్లని పానీయాలు తాగుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
తాటి ముంజలతో ఉపశమనం..
వేసవిలో శరీరానికి చలువ చేసే పండ్లు, ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వేడిచేసే, తాపం పెంచే శీతల పానీయాలు, ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. దీంతో చాలా మంది వేసవిలో పుచ్చకాయలు, కొబ్బరి బోండాలతోపాటు మామిడి పండ్లు, తాటి ముంజలు ఎక్కువగా తీసుకుంటున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇష్టపడి తినేవి తాటి ముంజలు. ఇవి వేసవిలో మాత్రమే దొరుకుతాయి. దీంతో చాలా మంది వీటికోసం ఎదురు చూస్తున్నారు. ప్రకృతి నుంచి వీటిలో కల్తీ ఉండదు. స్వచ్ఛమైనవి. వేసవి తాపం నుంచి ఉపశమనానికి తాటి ముంజలు ఎంతో ఉపయోగపడతాయి.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
తాటి ముంజలు తినడం వలన శరీరానికి పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
= తాటి ముంజల్లో విటమిన్స్, ఐరన్, కాల్షియం, జింక్, పాస్పరస్, పొటాషియం, థయామిన్, రోబో ప్లేవిస్, నియాసిస్, బీకాంప్లెక్స్ వంటివి ఉంటాయి. ఇవి అనారోగ్యం నుంచి కాపాడతాయి.
= తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ తగలకుండా ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. అంతేకాకుండా డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి.
= ఇక తాటి ముంజలు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
= తాటి ముంజలను ప్రతీ రోజు తీసుకోవడం వలన లివర్‌కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచిది వృద్ధి చెందుతుంది.
= తాటి ముంజల తీసుకోవడం వలన గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
= రొమ్ము క్యాన్సర్ నివారణలో తాటి ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి. అధిక బరువు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
= తాటి ముంజలతో ఆరోగ్యం మెరుగవడమే కాకుండా అందం కూడా పెరుగుతుంది. వాటిని గుజ్జుగా చేసి ముఖానికి రాసుకుంటే చెమటకాయలను తగ్గిస్తాయి. చర్మాన్ని కాపాడుతాయి.
= మొటిమలు ఎక్కువగా ఉండేవారు తాటి ముంజల్లోని తెల్లని గుజ్జును ప్రతీరోజు ముఖానికి రాసుకుంటే సమస్య తగ్గుతుంది. మెరిసే అందం మీ సొంతమవుతుంది.