Clay Pot: మట్టికుండలో నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Clay Pot: వేసవిలో సాధారణంగా దాహం వేస్తుంది. మిగతా కాలాలతో పోలిస్తే ఎండాకాలంలో గొంతు ఎండిపోతుంది. చీటికి మాటికి నాలుక తడారకుండా చూసుకోవాలి. గొంతు ఎండిపోతోంది. ప్రతి అరగంటకోసారి నీళ్లు తాగాలనిపిస్తుంది. ఈ కాలంలో చాలా మంది ఫ్రిజ్ వాటర్ తాగుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. గొంతు తడుపుకోవడానికి ఫ్రిజ్ వాటర్ అవసరం లేదు. మట్టి కుండలో నీరైతే చాలు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో దాగి ఉన్నాయి. సహజత్వానికి ప్రతీక ఏదైనా సహజత్వం వేరు […]

Written By: Srinivas, Updated On : April 21, 2023 11:44 am
Follow us on

Clay Pot

Clay Pot: వేసవిలో సాధారణంగా దాహం వేస్తుంది. మిగతా కాలాలతో పోలిస్తే ఎండాకాలంలో గొంతు ఎండిపోతుంది. చీటికి మాటికి నాలుక తడారకుండా చూసుకోవాలి. గొంతు ఎండిపోతోంది. ప్రతి అరగంటకోసారి నీళ్లు తాగాలనిపిస్తుంది. ఈ కాలంలో చాలా మంది ఫ్రిజ్ వాటర్ తాగుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. గొంతు తడుపుకోవడానికి ఫ్రిజ్ వాటర్ అవసరం లేదు. మట్టి కుండలో నీరైతే చాలు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో దాగి ఉన్నాయి.

సహజత్వానికి ప్రతీక

ఏదైనా సహజత్వం వేరు తయారు చేసింది వేరు. మనం ఫ్రిజ్ ను తయారు చేసుకుంటాం. అందుకే అందులో ఉండే నీటితో మనకు ముప్పే. కానీ చాలా మంది ఫ్రిజ్ కే ఆకర్షితులవుతున్నారు. పైగా ఫ్రిజ్ ఉంటే ఏదో సోషల్ స్టేటస్ ఉన్నట్లు బిల్డప్ ఇస్తుంటారు. నిజానికి ఫ్రిజ్ ఇంట్లో ఉండటం అంత శ్రేయస్కరం కాదు. కానీ కొనుక్కున్నాక వాడక తప్పక వాడుతున్నారు.

చల్లదనం

ఫ్రిజ్ లో చల్లదనానికి కుండలో ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా గమనించవచ్చు. మట్టి కుండలో నీరు తాగడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. కానీ ఫ్రిజ్ వాటర్ తాగితే గొంతు పట్టుకుంటుంది. జలుబు, జ్వరం వంటి రోగాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గొంతు సమస్యలు ఉన్న వారైతే ఫ్రిజ్ వాటర్ కు ఎంత దూరం జరిగితే అంత మంచిది.

Clay Pot

రోగాలు రాకుండా..

మట్టి కుండ రోగాలు రాకుండా నిరోధిస్తుంది. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి జబ్బులు రాకుండా చేస్తుంది. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. ఇలా మట్టికుండ మనకు అనేక లాభాలు కలిగిస్తుందని తెలిసినా ఎందుకో ఫ్రిజ్ వాటర్ కు ఆకర్షితులవుతున్నారు. తక్షణమే వైద్యులను కలిసి తమ అనారోగ్యాలను దూరం చేసుకుంటున్నట్లు తలుస్తోంది.