https://oktelugu.com/

Sleep: గాఢ నిద్ర పట్టేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాలేంటో తెలుసా?

Sleep: ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి వెన్నంటుకుంటూనే కన్నంటుకుంటుంది. కానీ కొందరు మాత్రం ఎంతకూ నిద్ర పోరు. అర్ధరాత్రి వరకు మేల్కొనే ఉంటారు. అటు ఇటు పక్క బొర్లిస్తూ నరకయాతన పడతారు. అయినా నిద్ర పట్టదు. ఇలాంటి వారికి అనారోగ్యాలు రావడం ఖాయం. అందుకే ప్రతి మనిషి రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోకపోతే ఇబ్బందులు వస్తాయి. దీని కారణంగా నిద్ర లేమి సమస్యకు పరిష్కారం చూసుకోవాల్సిందే. […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 24, 2023 / 06:04 PM IST
    Follow us on

    Sleep

    Sleep: ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి వెన్నంటుకుంటూనే కన్నంటుకుంటుంది. కానీ కొందరు మాత్రం ఎంతకూ నిద్ర పోరు. అర్ధరాత్రి వరకు మేల్కొనే ఉంటారు. అటు ఇటు పక్క బొర్లిస్తూ నరకయాతన పడతారు. అయినా నిద్ర పట్టదు. ఇలాంటి వారికి అనారోగ్యాలు రావడం ఖాయం. అందుకే ప్రతి మనిషి రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోకపోతే ఇబ్బందులు వస్తాయి. దీని కారణంగా నిద్ర లేమి సమస్యకు పరిష్కారం చూసుకోవాల్సిందే. నిద్రలేమి సమస్యకు ఆయుర్వేదంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి.

    నల్సమరది తైలం

    ఇది ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుంది. దీంతో నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. దీనికి ఏం చేయాలంటే స్నానానికి ముందు ఈ నూనెను రాసుకుని గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మన శరీరం మాశ్చరైజ్ చేసినట్లు అవుతుంది. ఫలితంగా మన శరీర భాగాలు బాగా రిలాక్స్ అవుతాయి. దీంతో మనకు మంచి నిద్ర పట్టేందుకు దోహదపడుతుంది.

    నీలభ్రంగాది తైలం

    దీన్ని తలకు పట్టించి మర్ధన చేసుకుంటే మంచి పలితం ఉంటుంది. ఈ నూనెను తలకు పట్టించడం ద్వారా చాలా ప్రయోజనాలు దక్కుతాయి. దీంతో శిరోజాలకు రక్షణ కలుగుతుంది. చుండ్రు రాకుండా చేస్తుంది. జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. వెంట్రుకలు బలంగా ఉండేందుకు దోహదపడుతుంది. ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే మంచి నిద్ర పట్టడం గ్యారంటీ.

    Sleep

    లావెండర్ ఆయిల్

    నిద్ర లేమికి చక్కని పరిష్కారం చూపిస్తుంది. కాటన్ బాల్ తీసుకుని దాని మీద ఓ రెండు చుక్కల లావెండర్ ఆలయిల్ వేసుకుని దిండు దగ్గర పెట్టుకుంటే దాని నుంచి వచ్చే చందనం వాసనకు మంచి నిద్ర పడుతుంది. దీని వాసన మనకు నిద్ర రావడానికి పరోక్ష కారణం అవుతుంది. ఇలా లావెండర్ ఆయిల్ మనకు మంచి నిద్ర పట్టేందుకు దోహదపడుతుంది. ఇలా ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని నిద్ర పోయేందుకు ప్రయత్నించడం మంచిది.

    Tags