Mosquito Bite: ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అంటూ తేడా లేకుండా చెత్తాచెదారం ఉన్న దగ్గర దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఒకసారి దోమలు కుట్టాయి అంటే వాటి పరిమాణాలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఈ దోమల బెడద నుంచి కాపాడుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొన్ని ఫలిస్తే మరికొన్ని ఇబ్బందులును కలిగిస్తాయి ఇక దోమలు పెద్దవిగా చిన్నవిగా ఉంటాయి. ఇవి కుట్టే విధానం కూడా చాలా భిన్నంగానే ఉంటుంది. కొన్ని దోమలు ఎప్పుడు కుట్టాయి ఎక్కడ కుట్టాయు తెలియకుండానే మాయం అవుతాయి.
ఇక వేసవి కాలం వస్తే ఈ దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం అనేక కాలాలో కూడా దోమల బెడద ఎక్కువగానే ఉంటుంది. మనుషులు, జంతువుల నుంచి రక్తం తాగుతూ జీవించే ఈ దోమలు ఆరోగ్య సమస్యలను తెస్తాయి. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వద్దనకుండా వస్తాయి. కొన్ని ధోమలు వెంటనే ఈ వ్యాధులను కలిగిస్తాయి. మరి ఈ విషయాలు తెలిసినవే.. కానీ ఇప్పుడు దోమల గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం.
ఒకసారి కుట్టిన దోమ మనిషిలో ఎంత రక్తం తాగుతుందో తెలుసా? సాధారణంగా దోమలు తమ శరీర బరువుకు మూడు రెట్లు రక్తం తాగుతాయట. వీటి బరువు 6 మి. గ్రాములు. అంటే ఒక దోమ కాటులో మానవ శరీరం నుంచి 1 నుంచి 10 మి. గ్రాముల రక్తాన్ని తాగుతాయట. ఒక వ్యక్తికి ఆహారం జీర్ణం కావడానికి మూడు నుంచి నాలుగు సార్లు నమలాలి. కానీ దోమలకు దంతాలు ఉండవు కాబట్టి.. వాటికి ఉండే స్టింగర ను మానవ శరీరంలో పెట్టి రక్తాన్ని పీలుస్తాయి. ఇవే వాటికి ఆహారం కూడా.
ఆడ దోమల పునరుత్పత్తికి రక్త ప్రోటీన్లు తోడ్పడుతాయి. అయితే మగ దోమలు కాకుండా ఆడ దోమలు మాత్రమే మనుషుల రక్తాన్ని తాగుతాయి. రక్తం తాగిన తర్వాత కొన్ని రోజుల వరకు దోమలు రెస్ట్ తీసుకుంటాయి. రక్తం జీర్ణం అయిన తర్వాత గుడ్లు అభివృద్ధి చెందుతాయి. ఆ తర్వాత వీటిని ఆడ దోమ నీటిలో ఉంచుతుంది. అందువల్ల దోమల ఉత్పత్తి అనేకంగా ఉంటుంది. మొత్తం మీద కొంచమే రక్తం ఉంటుందంటే ఈ దోమలు వాటి కోసం మననుంచి తీసుకుంటాయి. రక్తం తక్కువగా ఉంటే దోమల నుంచి కాస్త దూరంగా ఉండండి..