https://oktelugu.com/

Eggs Health Benefits: రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా? పచ్చని తినొచ్చా

మామూలుగా కష్టం చేయని వారైతే రోజుకు రెండు మూడు తీసుకోవచ్చు. గర్భిణులు, బాలింతలు, ఆటలు ఆడేవారు, కష్టం చేసే వారు మాత్రం నాలుగైదు తీసుకోవచ్చు. దీని వల్ల మన శరీరానికి ఎన్నో ప్రొటీన్లు అందుతాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 4, 2023 4:28 pm
    Eggs Health Benefits

    Eggs Health Benefits

    Follow us on

    Eggs Health Benefits: మనం తినే ఆహారాల్లో కోడిగుడ్డు కూడా ఒకటి. ఇది శాఖాహారమని కొందరు వాదిస్తుంటే మరికొందరు మాత్రం మాంసాహారం అని చెబుతున్నారు. చెట్ట నుంచి వచ్చినవి శాఖాహారాలు జంతువుల నుంచి వచ్చేవి మాంసాహారాలు. అయితే ఆవు, గేదె కూడా జంతువులే కదా మరి వాటి నుంచి వచ్చే పాలు శాఖాహారం ఎలా అవుతాయనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా గుడ్డు రోజు తీసుకోవడం వల్ల పోషకాలు అందుతాయని సూచిస్తున్నారు.

    రోజుకు ఎన్ని తినాలి?

    మామూలుగా కష్టం చేయని వారైతే రోజుకు రెండు మూడు తీసుకోవచ్చు. గర్భిణులు, బాలింతలు, ఆటలు ఆడేవారు, కష్టం చేసే వారు మాత్రం నాలుగైదు తీసుకోవచ్చు. దీని వల్ల మన శరీరానికి ఎన్నో ప్రొటీన్లు అందుతాయి. ఇవి మంచి కొవ్వును పెంచడం వల్ల గుండెపోటు సమస్య రాకుండా ఉంటుంది. గుండె జబ్బులు ఉన్న వారు మాత్రం వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం.

    గుడ్డు ఎలా ఉపయోగపడుతుంది

    గుడ్డు మన శరీరానికి బలం చేకూర్చే ఆహారాల్లో ముఖ్యమైనది. చర్మం, గోళ్లు, కంటిచూపుకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటు ఉన్న వారు గుడ్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ తిన్నా అందులో ఉండే పచ్చసొన తీసేయాలని చెబుతున్నారు. మధుమేహంతో బాధపడే వారు కూడా వీటిని తీసుకోకూడదని చెబుతున్నారు.

    గుడ్లలో ఏముంటుంది?

    గుడ్లలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. దీని వల్ల రోజుకో గుడ్డు తినడం వల్ల డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని ఉండదని చెబుతుంటారు. దీంతో గుడ్డులో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. కోడిగుడ్డును మన ఆహారంలో భాగంగా చేసుకుని అనారోగ్యాలను దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గమనించుకుని గుడ్డును తినేందుకు చొరవ తీసుకుంటే మంచిదే.