Walking Benefits: నీ నడకను బట్టే నీ ఆరోగ్యం

మనం వేసే అడుగులే మనకు శ్రీరామరక్ష. అందుకే నడక వల్ల మన ఆరోగ్యం మెరుగవుతుంది. నడకలో ఉన్న మహత్తర శక్తి అదే. దీనికి ఎవరు అతీతులు కారు. నడక వల్ల మనకు ఎన్నో రకాల రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Written By: Srinivas, Updated On : May 8, 2023 9:45 am

Walking Benefits

Follow us on

Walking Benefits: మనం రోజు ఉదయం పూట వాకింగ్ చేస్తుంటాం. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నడక కొనసాగించడం వల్ల మన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. నడిచే క్రమంలో కూడా సరైన పద్ధతులు ఉంటాయి. సక్రమంగా నడుస్తున్నామా లేదా అనేది పరిశీలించుకోవాలి. మనం నడిచేటప్పుడు అడుగులు ఎలా వేస్తున్నాం. సరైన విధంగా నడుస్తున్నామా? లేదా? అని తేల్చుకోవాలి.

మనం వేసే అడుగులే మనకు శ్రీరామరక్ష. అందుకే నడక వల్ల మన ఆరోగ్యం మెరుగవుతుంది. నడకలో ఉన్న మహత్తర శక్తి అదే. దీనికి ఎవరు అతీతులు కారు. నడక వల్ల మనకు ఎన్నో రకాల రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు నడక వల్ల అదుపులో ఉంటాయని పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అందుకే నడక వల్ల మనకు మేలు కలుగుతుంది.

మనం వేసే అడుగులు ఎలా పడుతున్నాయి? ఎలా నడవాలి? మన నడిచే పద్ధతి సరైందేనా? పాదాలు పూర్తిగా భూమికి తాకుతున్నాయా? మునివేళ్ల మీద నడుస్తున్నారా? ఇలా మనం నడక విషయంలో చేసే తప్పులు పరిశీలించుకోవాలి. నడకను సరైన రీతిలో ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి. లేదంటే మనం నడిచే నడక కూడా సరైన ఫలితాలు ఇవ్వదు. నిపుణుల సలహాల మేరకు మన నడకలో ఉన్న తప్పులను సరిదిద్దుకుని మంచి పద్ధతిలో నడిచేందుకు ప్రయత్నిస్తే మంచిది.

నడక మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదయం పూట చేసే వాకింగ్ మనలో ఆరోగ్యం కలిగేందుకు దోహదపడుతుంది. ఇలా నడక వల్ల మనకు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ప్రతి రోజు ఓ 45 నిమిషాల పాటు నడిస్తే మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మంచి లాభాలుంటాయి. వాకింగ్ ఓ ఔషధంలా పనిచేస్తుందని నమ్ముతుంటారు.