Donkey Milk: కరోనా వైరస్ ప్రజల ఆలోచనలను, ఆహారపు అలవాట్లను మార్చివేసింది. ప్రజల్లో చాలామంది ప్రస్తుత కాలంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకుంటే మాత్రమే వైరస్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో గాడిద పాల అమ్మకాలు ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి. గాడిద పాలు తాగడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నయమవుతాయని చాలామంది నమ్ముతున్నారు.
పూర్వీకులు సైతం గాడిద పాలు తాగాలని చెబుతుండటం గమనార్హం. గాడిద పాలు తల్లిపాలకు దగ్గరగా ఉంటాయని చాలామంది భావిస్తారు. ఒక గాడిద కేవలం 4 కప్పుల పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుండటంతో ఈ పాలకు డిమాండ్ మరింత పెరిగింది. గాడిద పాలలో సౌందర్యాన్ని పెంచే గుణాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. గాడిద పాలు రక్తపోటును తగ్గించి రక్త ప్రసరణలో వేగం పెరిగేలా చేయడంలో తోడ్పడతాయి.
Also Read: కక్షకట్టి నన్ను చంపాలని చూస్తున్నారని అంటున్న కరాటే కళ్యాణి… ఎవరంటే ?
గాడిద పాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ప్రోటీన్లను కలిగి ఉన్నాయి. గాడిద పాలలో ఉండే లాక్టోస్ ఎముకలను బలంగా మార్చడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. గాడిద పాలలో తక్కువ కెసిన్, సమాన స్థాయిలో ప్రోటీన్లు ఉంటాయి. గాడిద పాలు తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వైరస్ లు, బ్యాక్టీరియాల బారిన పడకుండా చేయడంలో గాడిద పాలు సహాయపడతాయని చెప్పవచ్చు.
దగ్గు, జలుబు నయం చేయడానికి గాయాల చికిత్సకు గాడిద పాలను ఉపయోగించడం జరుగుతుంది. గాడిద పాలను శిశువులకు పట్టిస్తే మంచిదని చాలామంది భావిస్తారు. గాడిద పాలతో షాంపూలు, సబ్బులు, ఫేస్ మాస్కులు, స్కిన్ క్రీములను తయారు చేయవచ్చు. ఈ పాలతో స్నానం చేస్తే మెత్తని, మృదువైన చర్మాన్ని పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఇందులో ఉండే ప్రోటీన్లు వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి.