https://oktelugu.com/

Plastic Bottles: ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్స్ లోని నీళ్లను తాగుతున్నారా.. ప్రాణాలకే ప్రమాదమట

Plastic Bottles: మనలో చాలామంది ప్రయాణ సమయాలలో, ఆఫీస్ లలో ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా నీటిని తాగడానికి ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. ఇళ్లలో నీటిని తాగడానికి ప్లాస్టిక్ క్యాన్స్ ను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ క్యాన్స్ తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి వీటిని వినియోగించడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మాత్రం వీటిని వినియోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్స్ లో విడుదలయ్యే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 8, 2022 3:56 pm
    Follow us on

    Plastic Bottles: మనలో చాలామంది ప్రయాణ సమయాలలో, ఆఫీస్ లలో ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా నీటిని తాగడానికి ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. ఇళ్లలో నీటిని తాగడానికి ప్లాస్టిక్ క్యాన్స్ ను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ క్యాన్స్ తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి వీటిని వినియోగించడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మాత్రం వీటిని వినియోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు.

    ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్స్ లో విడుదలయ్యే బెథాలేట్ అనే కెమికల్ క్యాన్సర్లకు కారణమవుతోంది. ఈ కెమికల్ వల్ల ప్రధానంగా కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీటిని తాగడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీటిని తాగడం వల్ల లైంగికపరమైన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

    ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే వాటర్ లో కెమికల్స్ చేరడం వల్ల నీరు విషతుల్యం అయ్యే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ ను ఎండలో ఉంచితే ప్లాస్టిక్ కరిగి నీటిలో చేరే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్లు శరీరంలోని హార్మోన్లపై కూడా ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్ల వల్ల భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.

    ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కూడా హాని జరుగుతుందనే సంగతి తెలిసిందే. మార్కెట్ లో ప్లాస్టిక్ వాటర్ ను తాగేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్ వాటర్ వాటిల్స్ కు బదులుగా కాపర్ వాటర్ బాటిల్స్ ను వినియోగిస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.