Sleep : రాత్రిళ్లు నిద్రతక్కువైతే ఎంత డేంజర్ నో తెలుసా?

Sleep : మనిషికి కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర అవసరం. ప్రతి జీవికి ఇవి రెండు ముఖ్యమే. దీంతో సరైన నిద్ర పోవడానికి తగిన పరిస్థితులు కల్పించుకోవాలి. మారుతున్న జీవనశైలితో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనిపై ఎన్నో రకాల పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. రాత్రుళ్లు సరైన నిద్ర పోయేందుకు అనువైన వాతావరణం కల్పించుకోవాలి. లేకపోతే నిద్ర తక్కువైతే కష్టాలు రావడం ఖాయం. తగిన నిద్ర రాకపోతే ఎదురయ్యే సమస్యల గురించి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిద్ర సరిగా […]

Written By: Srinivas, Updated On : March 17, 2023 6:36 pm
Follow us on

Sleep : మనిషికి కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర అవసరం. ప్రతి జీవికి ఇవి రెండు ముఖ్యమే. దీంతో సరైన నిద్ర పోవడానికి తగిన పరిస్థితులు కల్పించుకోవాలి. మారుతున్న జీవనశైలితో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనిపై ఎన్నో రకాల పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. రాత్రుళ్లు సరైన నిద్ర పోయేందుకు అనువైన వాతావరణం కల్పించుకోవాలి. లేకపోతే నిద్ర తక్కువైతే కష్టాలు రావడం ఖాయం. తగిన నిద్ర రాకపోతే ఎదురయ్యే సమస్యల గురించి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నిద్ర సరిగా పోకపోతే చిక్కులు ఎదురవుతాయి. మనం తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు. దీంతో పాటు ఇతర సమస్యలు వెంటాడుతాయి. కంటి నిండ నిద్ర పోవడం వల్ల మన అవయవాలు విశ్రాంతి తీసుకుంటాయి. దీంతో మరుసటి రోజు అవి బాగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. నిద్ర సరిగా పోకపోవడం వల్ల కాళ్లలో రక్త సరఫరా ఆగిపోతోంది. దీని వల్ల ఫెరిఫెరల్ ఆర్టెరీ డిసీజ్ బారిన పడే అవకావాలున్నాయని స్వీడన్ పరిశోధనలో గుర్తించారు.

రాత్రి పూట అయిదు గంటల కంటే తక్కువ సమయం నిద్ర పోయే వారికి అనేక సమస్యలు వస్తాయి. కాళ్లలో రక్తసరఫరా సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. దీంతో కాళ్లు వాపు ఎక్కినట్లు కనిపిస్తాయి. పక్షవాతం, గుండెపోటు వంటి వ్యాధుల ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ఈ సమస్యతో సతమతమవుతున్నట్లు సూచిస్తున్నాయి. దీని కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.

ప్రస్తుత కాలంలో ఆధునిక జీవన శైలితో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. సరైన నిద్ర లేకపోతే అనారోగ్యాలు దరి చేరడం ఖాయం. స్వీడన్ దేశంలో నిర్వహించిన ఓ అధ్యయనంలో నిద్ర లేమితో వచ్చే సమస్యల గురించి వివరించారు. పలు రోగాలకు నిలయంగా మారే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. దీంతో సరైన నిద్ర పోయేందుకు తగిన పరిస్థితులు కల్పించుకుని రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు తెలుసుకుంటే మంచిది.

Tags