Blue berry: ప్రస్తుత కాలంలో మధుమేహం బారిన పడిన వాళ్లు ఎంతో టెన్షన్ పడుతున్నారు. మధుమేహం వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే మధుమేహంను అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. సరైన ఆహారపు అలవాట్లు లేనివాళ్లను మధుమేహం సమస్య వేధించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఆలస్యంగా ఈ సమస్యను గుర్తించడం వల్ల ప్రాణాలకు అపాయం కలుగుతోంది.
అయితే కొన్ని పండ్లు మధుమేహం నుంచి కాపాడటంలో ఎంతగానో ఉపయోగపడతాయి. బ్లూబెర్రీ ఫ్రూట్ మధుమేహంను నియంత్రించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. బ్లూబెర్రీ పండ్లలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉండటంతో పాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రియంట్స్‌లో సైతం బ్లూబెర్రీ తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుందని వెల్లడైంది.
బ్లూ బెర్రీ మెదడును చురుకుగా ఉంచడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టడంలో బ్లూ బెర్రీ ఎంతగానో సహాయపడుతుంది. వృద్ధుల్లో జ్ఞాపకశక్తిని పెంచడంలో బ్లూ బెర్రీ ఉపయోగపడుతుంది. బ్లూ బెర్రీస్ లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. బ్లూ బెర్రీలో విటమిన్లు, పోషకాలతో పాటు లవణాలు సైతం ఉంటాయి.
బ్లూ బెర్రీస్ ఆకులు కూడా మధుమేహంకు చెక్ పెట్టడంలో ఉపయోగపడతాయి. ఈ ఆకులతో తయారు చేసిన కషాయాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. బ్లూ బెర్రీస్ లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆహారంలో బ్లూ బెర్రీ ఫ్రూట్ ను చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు.